బాల‌కృష్ణ (Balakrishna) సినిమాకు సై అంటున్న‌ బాలీవుడ్ హీరోయిన్!.. ఇదంతా అనిల్ రావిపూడి ప్లానేనా!

Updated on Jul 29, 2022 08:48 PM IST
బాల‌కృష్ణ (Balakrishna) సినిమా ఎన్‌బీకే 108 లో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా న‌టించ‌నున్నార‌ట‌.
బాల‌కృష్ణ (Balakrishna) సినిమా ఎన్‌బీకే 108 లో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా న‌టించ‌నున్నార‌ట‌.

టాలీవుడ్ హీరో బాల‌కృష్ణ (Balakrishna) దూకుడు మీద ఉన్నారు. బ‌ల‌మైన క‌థ‌లున్న సినిమాల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. 'అఖండ' సినిమాతో బాల‌కృష్ణ‌కు ఫాలోయింగ్ మ‌రింత పెరిగింది. 'అఖండ' సినిమా విజ‌యంతో బాల‌కృష్ణ విభిన్నమైన క‌థ‌ల‌తో.. ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల‌తో త‌న న‌ట విశ్వ రూపం చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో బాల‌కృష్ణ సినిమా కోసం ఏకంగా నిర్మాతలు బాలీవుడ్ హీరోయిన్‌ను రంగంలోకి దించుతున్నార‌ట‌.

మాస్ మూవీగా ఎన్‌బీకే 107

హీరో బాల‌కృష్ణ (Balakrishna), ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని కాంబోలో ఓ పవర్ ఫుల్ మాస్ మూవీ తెర‌కెక్కుతోంది. NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌కు జోడిగా శృతిహాస‌న్ న‌టిస్తున్నారు. ఈ సినిమాకు 'జై బాల‌య్య' అనే టైటిల్‌ని ఇప్పటికే ఖ‌రారు చేశార‌ని టాక్. 'ఎన్‌బీకే 107' సినిమాకు త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. 

 

బాల‌కృష్ణ (Balakrishna) సినిమా ఎన్‌బీకే 108 లో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా న‌టించ‌నున్నార‌ట‌.

బాల‌య్య కోసం బాలీవుడ్ హీరోయిన్‌

ఇక 'ఎఫ్ 2' ఫేమ్ అనిల్ రావిపూడి ద‌ర్వ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న‌ 'ఎన్‌బీకే 108' చిత్రంపై బాల‌కృష్ణ బాగానే ఆశలు పెట్టుకున్నారు . ఆ సినిమాలో బాల‌కృష్ణ‌కు జోడిగా బాలీవుడ్ కథానాయిక సోనాక్షి సిన్హా  నటించే అవకాశం ఉందని టాక్. ఒకవేళ అదే నిజమైతే.. బాల‌కృష్ణ సినిమాతో సోనాక్షి సిన్హా తొలిసారిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ప్ర‌స్తుతం సోనాక్షి హిందీ సినిమాల‌తో పాటు, సౌత్ సినిమాలపై కూడా ఫోక‌స్ చేశారు. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన 'లింగ' సినిమాలో సోనాక్షి న‌టించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో గిరిజ‌న యువ‌తిగా న‌టించిన సోనాక్షి, ప్రేక్ష‌కులతో పాటు విమర్శకుల ప్ర‌శంస‌లు కూడా అందుకున్నారు. 

'ఎన్‌బీకే 108'  చిత్రాన్ని తండ్రీ, కూతుళ్ల ఎమోష‌న్స్‌‌తో సాగే క‌థ‌గా అనిల్ రావిపూడి చిత్రీక‌రించ‌నున్నారు. బాల‌కృష్ణ (Balakrishna) తండ్రి పాత్ర‌లో, హీరోయిన్ శ్రీలీల కూతురు పాత్ర‌లో ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. ఇదే క్రమంలో ఈ సినిమాలో బాల‌కృష్ణ స‌ర‌స‌న సోనాక్షి న‌టించ‌నున్నారనే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ప్ర‌స్తుతం సోనాక్షి న‌టించిన 'డ‌బుల్ ఎక్స్ఎల్' హిందీ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. 

Read More: బాల‌కృష్ణతో (Balakrishna) మూవీ మాములుగా ఉండ‌దు : అనిల్ రావిపూడి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!