NBK 108: 'ఎన్‌బీకే 108' అప్‌డేట్స్ రిలీజ్ చేస్తున్నార‌ట‌!.. పండుగ అంటున్న బాల‌కృష్ణ (Balakrishna) ఫ్యాన్స్

Updated on Aug 11, 2022 02:47 PM IST
బాల‌య్య‌ (Balakrishna) తో తాను తెర‌కెక్కించే సినిమా విజ‌య‌వంతం కావాల‌ని దేవుడిని కోరుకున్నాన‌ని అనిల్ రావిపూడి తెలిపారు. 
బాల‌య్య‌ (Balakrishna) తో తాను తెర‌కెక్కించే సినిమా విజ‌య‌వంతం కావాల‌ని దేవుడిని కోరుకున్నాన‌ని అనిల్ రావిపూడి తెలిపారు. 

NBK !08: అఖండ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌‌తో నందమూరి నటసింహా బాలకృష్ణ (Balakrishna) సినిమాల‌కు డిమాండ్ పెరిగింది. బాల‌కృష్ణ ఎలాంటి సినిమాల‌తో బాక్సాఫీస్ షేక్ చేస్తారోన‌ని ప్రేక్ష‌కులు అంచ‌నాలు వేసుకుంటున్నారు. బాల‌కృష్ణ త‌న 108వ సినిమాను 'ఎఫ్ 2' ఫేమ్ అనిల్ రావిపూడితో చేస్తున్నారు. 'ఎన్‌బీకే 108' సినిమాపై భారీ అప్‌డేట్‌ను మేక‌ర్స్ ఈ రోజు రిలీజ్ చేయ‌నున్నారు.

ప్ర‌త్యేక పూజ‌లు చేయించిన అనిల్

'ఎన్‌బీకే 108' సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. NBK 108 స్క్రిప్ట్‌ను అనిల్ రావిపూడి  సింహాద్రి అప్పన్న స్వామి వారి పాదాల వ‌ద్ద ఉంచి ప్ర‌త్యేక పూజ‌లు కూడా చేయించారు. బాల‌కృష్ణ (Balakrishna) తో అనిల్ రావిపూడి ఓ యాక్ష‌న్ సినిమాను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. బాల‌య్య‌తో తాను తెర‌కెక్కించే సినిమా విజ‌య‌వంతం కావాల‌ని దేవుడిని కోరుకున్నాన‌ని అనిల్ రావిపూడి తెలిపారు. 

బొమ్మ హిట్టే అంటున్న ఫ్యాన్స్

నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna)  న‌టించ‌బోయే 'ఎన్‌బీకే 108' సినిమా వివ‌రాలు కొన్ని గంట‌ల్లో విడుద‌ల కానున్నాయి. దీంతో బాల‌య్య అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అనిల్ రావిపూడి బాల‌య్య‌ను ఏ రేంజ్‌లో చూపిస్తారోన‌ని ఎదురుచూస్తున్నారు. బాలయ్య సరసన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా న‌టించ‌నున్నార‌ట‌. బాల‌కృష్ణ సినిమాలో కొత్త‌ద‌నం కోసం అనిల్ రావిపూడి ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే త‌న సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టించాల‌ని రాజ‌శేఖ‌ర్‌ను కోరార‌ట‌.

ఈ సినిమాలో బాల‌య్య బాబు తండ్రి పాత్రలో ..పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల కూతురి రోల్‌లో న‌టించ‌నున్నారు. బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మ‌లినేని గోపిచంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న 'ఎన్‌బీకే 107'లో న‌టిస్తున్నారు. బాల‌కృష్ణ మాస్ యాక్ష‌న్ సినిమాలతో బాక్సాఫీస్‌ను బ‌ద్ద‌లు కొడ‌తార‌ని అభిమానులు అంటున్నారు.

Read More: సినారే జీవన సాఫల్య పుర‌స్కారం అందుకున్న నందమూరి బాల‌కృష్ణ‌ (Nandamuri Balarishna)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!