1 Year For Akhanda: 'అఖండ' విడుదలై ఏడాది.. బాలకృష్ణ (Balakrishna) నటనకు దద్దరిల్లిన థియేటర్లు

Updated on Dec 02, 2022 04:12 PM IST
 బాలకృష్ణ (Balakrishna) నటించిన 'అఖండ' సినిమాలు పలు రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.
బాలకృష్ణ (Balakrishna) నటించిన 'అఖండ' సినిమాలు పలు రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.

1 Year For Akhanda: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు 'అఖండ' సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ తరువాత థియేటర్లలో రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సినిమా 'అఖండ'. ఈ సినిమా విడుదలైన తొలిరోజు నుంచి కలెక్షన్ల సునామీ సృష్టించింది.

బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో నటించి వెండితెరను షేక్ చేశారు.డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి కాంబోలో తెరకెక్కిన 'అఖండ' సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తమన్ స్వరపరిచిన "జై బాలయ్య" పాట ప్రేక్షకులను అలరించింది. ప్రగ్యా జైశ్వాల్‌, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. అఖండమైన విజయాలను సాధించిన 'అఖండ' చిత్రం టాప్ 10 ఆసక్తికర విశేషాలపై పింక్ విల్లా ప్రత్యేక కథనం.

 బాలకృష్ణ (Balakrishna)

  • హీరో బాల‌కృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'సింహా', 'లెజెండ్' చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచాయి. వీరిద్దరి కాంబోలో 2021 డిసెంబర్ 2 తేదీన విడుదలైన చిత్రం 'అఖండ' సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. బాల‌కృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో హ్యాట్రిక్ హిట్‌గా 'అఖండ' నిలిచింది. 
  • 'అఖండ' సినిమా విడుదలైన తొలి రోజు నుంచి పాజిటీవ్ టాక్‌తో థియేటర్లను షేక్ చేసింది. ఈ చిత్రం 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. నాలుగు కేంద్రాల్లో 100రోజులు పూర్తి చేసుకుని 'అఖండ' రికార్డును సృష్టించింది. చిల‌క‌లూరిపేట రామ‌కృష్ణ థియేట‌ర్లో 175 రోజులు పూర్తి చేసుకుంది
  • 'అఖండ' విడుదలైన 10 రోజుల్లో రూ. 100 కోట్ల‌కు పైగా బాక్సాఫీస్ గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధించింది. ఈ సినిమాను రూ. దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే.. బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

 బాలకృష్ణ (Balakrishna)

  • 'అఖండ' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బాలయ్య కెరీయర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా 'అఖండ' నిలిచింది.  

  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌ రాష్ట్రాలతో పాటు మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌లలో 50 రోజులు 'అఖండ' ప్రదర్శితమై రికార్డులు నెలకొల్పింది. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లోలోనూ 'అఖండ' చిత్రం అర్ధ‌శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుంది.

  • రచయిత ఎం. రత్నం రాసిన డైలాగులు ధియేటర్లలో పేలాయి. 'మీకు సమస్య వస్తే దండం పెడతారు. మేము ఆ సమస్యకే పిండం పెడతాం' వంటి డైలాగులు ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యాయి. 

 బాలకృష్ణ (Balakrishna)

​​​​​​

  • మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా జై బాలయ్య పాట ప్రతీ చోట మోత మోగింది.

  • థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ 'అఖండ' (Akhanda) చిత్రం రికార్డులు నెలకొల్పింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అయిన ఈ చిత్రం మంచి వ్యూయర్ షిప్‌ను సాధించింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన 24 గంట‌ల్లోనే 10 మిలియ‌న్ల మంది వీక్షించారు.

 బాలకృష్ణ (Balakrishna)

  • 'అఖండ' రిలీజ్ అయిన 11 రోజుల పాటు వ‌రుస‌గా కోటి రూపాయలు తగ్గకుండా వసూళ్లు సాధించింది. అంతేకాదు మొదటి వారం మొత్తం అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్ రాబట్టింది. 

  • బాలకృష్ణ కెరీర్‌లో వన్ ది స్పెషల్ మూవీగా నిలిచిన 'అఖండ'  53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు.

Read More: 'వీర సింహారెడ్డి' (veerasimhareddy) నుంచి 'జై బాలయ్య మాస్ ఆంథెమ్' (Jai Balayya Mass Anthem) రిలీజ్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!