తెలుగు ప్రేక్షకులకు పండుగ అంటే సినిమానే.. 'ది ఘోస్ట్' (The Ghost) హిట్ అవుతుంది - నాగార్జున (Nagarjuna)
టాలీవుడ్ హీరో నాగార్జున (Nagarjuna) నటించిన 'ది ఘోస్ట్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా నాగార్జునతో హీరో అడవి శేష్ ఇంటర్వ్యూ చేశారు. అడవి శేష్‌తో 'ది ఘోస్ట్' సినిమా గురించిన విశేషాలను నాగార్జున పంచుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు పండుగ అంటేనే కొత్త సినిమా అని నాగార్జున అన్నారు. గతంలో పండుగ రోజున నాలుగైదు సినిమాలు రిలీజ్ అయ్యేవని గుర్తుచేశారు.
ప్రవీణ్ యాక్షన్ సినిమాలు బాగా తీస్తాడు - నాగ్
ఒక సినిమా చేయాలంటే స్క్రిప్ట్‌ను నమ్ముతారా? మనిషిని నమ్ముతారా?. అని అడవి శేష్ నాగార్జునను అడిగారు. తాను మనిషినే నమ్ముతానని తెలిపారు నాగార్జున. ఓ సినిమా కోసం కొన్ని నెలలు ఓ వ్యక్తితో పనిచేయాల్సి ఉంటుందని.. స్క్రిప్ట్ నచ్చి మనిషి నచ్చకపోతే సమయం వృధానే అన్నారు నాగ్.
ప్రవీణ్ యాక్షన్ సినిమాలను బాగా తెరకెక్కిస్తారనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. 'ది ఘోస్ట్' (The Ghost) సినిమా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో రిలీజ్ అయితే ఆ సినిమాలో కొత్తదనం ఉంటుందని తనకు అనిపించిందన్నారు. ప్రవీణ్ సత్తారు చిత్రీకరించిన 'గరుడ వేగ' సినిమా తనకు నచ్చిందన్నారు.
'ది ఘోస్ట్' సక్సెస్ అవుతుంది - నాగార్జున
ప్రవీణ్ నుంచి ఆశించిన దానికన్నా ఎక్కువగా తన సినిమాను డైరెక్ట్ చేశారన్నారు. సినిమా కోసం ప్రవీణ్ చాలా కష్టపడతారన్నారు. ఈ సినిమాలోని డైలాగులలో ఇంగ్లీష్ పదాలు వాడితే.. తెలుగు భాష కోసం ప్రవీణ్‌తో ఫైట్ చేసేవాడినన్నారు. 'ది ఘోస్ట్' సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. 'ది ఘోస్ట్' చిత్రం కోసం చిత్ర యూనిట్ ఎంతో శ్రమించిందన్నారు. ఈ సినిమాకు సూటయ్యే నటీనటులను ప్రవీణ్ కరెక్ట్‌గా సెలక్ట్ చేశారన్నారు.
Read More: The Ghost: 'ది ఘోస్ట్' రన్ టైమ్ రిలీజ్.. తక్కువ సమయంలో ఎక్కువ వినోదం అంటున్న నాగ్ (Nagarjuna)