The Ghost : 'ది ఘోస్ట్' ప్రిరీలీజ్ వేడుకలో అక్కినేని నాగార్జున పంచుకున్న ముచ్చట్లు ఇవే !

Updated on Sep 26, 2022 02:25 PM IST
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కథానాయకుడిగా నటించిన  "ది ఘోస్ట్ " చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కథానాయకుడిగా నటించిన "ది ఘోస్ట్ " చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు.

కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కాలేజీ మైదానంలో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కథానాయకుడిగా నటించిన  "ది ఘోస్ట్ " (The Ghost) సినిమా ప్రీ రిలీజ్ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకలో అఖిల్, నాగచైతన్య కూడా పాల్గొన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  "ది ఘోస్ట్ " చిత్రంలో సోనాల్ చౌహాన్ కథానాయికగా నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదిన విడుదల కానుంది. 

ఈ కార్యక్రమంలో నాగార్జున ప్రత్యేకంగా మాట్లాడారు. అందులోని  టాప్ 10 స్టేట్ మెంట్స్ మీకోసం ..

ఏఎన్నార్ లివ్స్ ఆన్
ఈ రోజు నేను, నా బిడ్డలు అఖిల్, చైతూ ఇంత ఆదరణను పొందుతున్నానమంటే దానికి కారణం తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరియు స్వర్గీయ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు. ఏఎన్నార్ లివ్స్ ఆన్. 

అప్పుడు 'శివ'.. ఇప్పుడు 'ఘోస్ట్'
33 ఏళ్ల క్రితం అక్టోబర్ 5వ తేదిన "శివ" (Shiva) సినిమాతో మీ ముందుకు చైన్ పట్టుకొని వచ్చాను. ఇప్పుడు అదే తేదిన మళ్లీ కత్తితో "ఘోస్ట్" (Ghost) రూపంలో మీ ముందుకు వస్తున్నా.

కర్నూలుతో నా అనుబంధం ఇదే
నేను కర్నూలు ప్రాంతానికి అన్నమయ్య సినిమా టైమ్‌లో వచ్చా. అప్పుడు ఆ నరసింహస్వామికి దణ్ణం పెట్టుకున్నా. బసవన్న ముందు డ్యాన్స్ కూడా చేశా. ఇప్పుడు మళ్లీ అదే కర్నూలులో ఘోస్ట్ మూవీ ప్రిరీలీజ్ వేడుక జరగడం ఆనందంగా ఉంది.

చిరంజీవికి ఆల్ ది బెస్ట్
అక్టోబర్ 5వ తేదిన "ది ఘోస్ట్" (The Ghost) చిత్రంతో పాటు నాకు ఎంతో ఆప్తుడైన చిరంజీవి గారి సినిమా కూడా విడుదల అవుతోంది. ఈ రెండు సినిమాలు కూడా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. 

బంగార్రాజు టీఆర్పీలో నెంబర్ వన్
నేను ఈ సంవత్సరం చైతూతో కలిసి 'బంగార్రాజు' చిత్రంలో నటించాను. ఈ సినిమా థియేటర్లతో పాటు ఓటీటీ, టెలివిజన్‌లో కూడా దుమ్ము దులిపేసింది. ఇప్పటి వరకు ఏ సినిమాకి రాని టీఆర్పీని సొంతం చేసుకుంది. 

విజయదశమి సక్సెస్ కోసం వెయింటింగ్
విజయదశమి అందరికీ విజయాన్ని ఇస్తుందని అంటారు. ఈ పండగ మా 'మా ఘోస్ట్'కి (The Ghost) కూడా తప్పకుండా విజయాన్ని ఇస్తుందని నేను భావిస్తున్నాను. 

 

The Ghost

మిలట్రీ ట్రైనింగ్ తీసుకున్నాం
ఈ సినిమా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు చాలా టాలెంటెడ్ వ్యక్తి. నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాలలో గన్‌లు, కత్తులు పట్టుకొని తిరిగాను. కానీ ప్రవీణ్ ప్రోద్బలం వల్ల, మేము ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మిలటరీ ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది

అఖిల్‌తో సినిమా
త్వరలో నా కొడుకు అఖిల్‌తో ఓ సినిమా చేస్తున్నా. ఓ డిఫరెంట్ సబ్జెక్టుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. "ఘోస్ట్, ఏజెంట్ సినిమాలు కలిస్తే ఎలా ఉంటుందో, అలా ఉంటుంది ఆ సినిమా"

ఫుల్ మీల్స్ లాంటి చిత్రం 'ఘోస్ట్' (Ghost)
చాలా కాలం తర్వాత ఫుల్ మీల్స్ లాంటి ఓ యాక్షన్ సినిమా చేశాను. అంతేకాదు.. మీలో ఉత్సాహం చూడడానికే అఖిల్‌ని, చైతూని ఈ ఫంక్షన్‌కు తీసుకొచ్చాను. 

విజువల్ ఎఫెక్ట్స్ మామూలుగా ఉండవు
"శివ" సినిమా విషయంలో సౌండ్ ఎంత ప్రత్యేకమైన పాత్ర పోషించిందో, "ది ఘోస్ట్" సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ అంతే ప్రత్యేకమైన పాత్రను పోషిస్తాయి.

ఇవండీ.. 'ది ఘోస్ట్' మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో అక్కినేని నాగార్జున పంచుకున్న ముచ్చట్లు

Read More : టాలీవుడ్ 'కింగ్' అక్కినేని నాగార్జున కెరీర్ లో టాప్ 10 సినిమాలివే..!

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!