నాగ చైత‌న్య (Naga Chaitanya) వెంక‌ట ప్ర‌భు కాంబోలో కొత్త సినిమా .. స‌మంత‌కు కౌంట‌ర్ ఇచ్చిన‌ట్టేనా !

Updated on Jun 22, 2022 10:16 PM IST
నాగ చైత‌న్య (Naga Chaitanya) త‌న కొత్త ప్రాజెక్టుల అప్ డేట్ ద్వారా స‌మంత‌కు కౌంట‌ర్ ఇచ్చారా?.
నాగ చైత‌న్య (Naga Chaitanya) త‌న కొత్త ప్రాజెక్టుల అప్ డేట్ ద్వారా స‌మంత‌కు కౌంట‌ర్ ఇచ్చారా?.

నాగ చైత‌న్య (Naga Chaitanya)  కొత్త సినిమా అప్‌డేట్స్ వ‌చ్చేశాయి. ద‌ర్శ‌కుడు వెంక‌ట ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య త‌న 22 వ సినిమా చేయ‌నున్నారు. శ్రీనివాస్ సిల్వ‌ర్ స్కీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైత‌న్య, వెంక‌ట ప్ర‌భు కాంబోలో వ‌స్తున్న సినిమా వివ‌రాలు జూన్ 23 న అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. తెలుగు, తమిళ భాష‌ల్లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. 

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్ద‌రూ విడాకుల త‌ర్వాత కెరీర్ పై దృష్టి పెట్టారు. అయితే నాగ చైత‌న్య‌, స‌మంత‌లపై ఎన్నో రూమ‌ర్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

లవ్ స్టోరీ, బంగార్రాజు సక్సెస్ త‌ర్వాత 'థ్యాంక్యూ' సినిమాతో నాగ చైత‌న్య (Naga Chaitanya) హ్యాట్రిక్ కొట్టాల‌ని చూస్తున్నారు. 'థ్యాంక్యూ' చిత్రంలో నాగ చైత‌న్య‌కు జోడిగా రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు విక్రమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 'థ్యాంక్యూ' సినిమాను దిల్ రాజు నిర్మించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. 'థ్యాంక్యూ' సినిమా త‌ర్వాత వెంక‌ట ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో చైతూ మరో సినిమాలో న‌టించ‌నున్నారు. 
 
స‌మంతకు కౌంట‌రా?

స‌మంత సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. త‌న లైఫ్‌కు సంబంధించిన ప్ర‌తీ విష‌యాన్ని స‌మంత సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో షేర్ చేసుకుంటారు. కానీ నాగ చైత‌న్య మాత్రం అలా కాదు. త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలను అంత‌గా షేర్ చేసుకోరు. 

నాగ చైత‌న్య‌, శోభిత ధూళిపాళ‌ స‌హ‌జీవనం చేస్తున్నారనే వార్త‌పై స‌మంత త‌న‌దైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. మాజీ భ‌ర్త డేటింగ్‌పై వ‌చ్చిన వార్త‌ల‌పై సామ్ ఫైర్ అయ్యారు. స‌మంత త‌న పీఆర్ టీమ్‌పై వార్త‌లు రాసిన వారికి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. అంతే కాకుండా 'అబ్బాయిలు.. ఇక నైనా ఎద‌గండి' అంటూ ప‌రోక్షంగా ఇంకెవ‌రికో సెటైర్లు విసిరారు. 'శోభిత‌, చై'ల డేటింగ్ వ్య‌వ‌హారంపై స‌మంత చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 

చై ఫ్యాన్స్‌పై స‌మంత ఫైర్
స‌మంత పీఆర్ టీమ్‌పై నాగ‌చైత‌న్య (Naga Chaitanya)  ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. నాగ‌చైత‌న్య‌, శోభిత ధూళిపాళ డేటింగ్ న్యూస్ వెనుక స‌మంత పీఆర్ టీమ్ హ‌స్తం ఉందంటున్నారు. నాగ చైత‌న్య‌పై లేనిపోని పుకార్లు ప్ర‌చారం చేస్తున్నార‌ని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే నాగ చైత‌న్య ఫ్యాన్స్‌కు స‌మంత స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ట్వీట్ చేశారు. 
 
స‌మంత‌కు నాగ‌చైత‌న్య‌ కౌంట‌ర్ ఇచ్చారా?
నాగ చైత‌న్య (Naga Chaitanya)  త‌న కొత్త ప్రాజెక్టుల అప్ డేట్ ద్వారా స‌మంత‌కు కౌంట‌ర్ ఇచ్చారు. 'అబ్బాయిలు వ‌ర్క్‌పై ఫోక‌స్ చేయండి' అంటూ స‌మంత పోస్ట్ చేశారు. ఈ క్రమంలో నాగ చైత‌న్య కూడా త‌న‌ వ‌ర్క్ మీద ఫోక‌స్ చేస్తున్నానని తెలిపే ట్వీట్స్ చేస్తూ, స‌మంతకు కౌంట‌ర్ ఇచ్చారంటూ చై అభిమానులు అంటున్నారు. స‌మంత అన‌వ‌స‌రంగా నాగ‌చైత‌న్య‌పై విరుచుకుప‌డుతుంద‌ని.. కానీ చై మాత్రం అలా కాద‌ని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయంపై స‌మంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read More: Naga Chaitanya (నాగ చైతన్య) : యూత్ సత్తాని చాటి చెప్పిన .. 'థాంక్యూ' సినిమాలోని 'మారో మారో' సాంగ్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!