మంచు విష్ణుని (Vishnu Manchu) బాదేసిన సన్నీలీయోన్, పాయల్‌ రాజ్‌పుత్.. గుణపాఠం చెప్పామని వీడియో పోస్ట్‌ చేసిన సన్నీలియోన్

Updated on May 13, 2022 09:06 PM IST
మంచు విష్ణు (Vishnu Manchu), పాయల్‌ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌
మంచు విష్ణు (Vishnu Manchu), పాయల్‌ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌

మంచు విష్ణు (Vishnu Manchu), పాయల్‌ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌ కలిసి సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల రామోజీ ఫిలింసిటీలో కూడా జరిగింది. సినిమాలో విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్‌ గ్యాప్‌లో ముగ్గురూ రిలాక్స్ అవుతూ పలు ఫన్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల వీళ్లు పెట్టిన వీడియో వైరల్ అయ్యింది.

మంచు విష్ణు నడుస్తూ ఉండగా.. ఆ పక్కనే ఉన్న ఒక బల్లపైన పాయల్ రాజ్‌పుత్ కూర్చుంది. అప్పుడు విష్ణుని 'మీ ఫేవరేట్ ఎవరు?' అని పక్కనున్న ఒకరు అడిగారు. దానికి విష్ణు 'ఇంకెవరు పాయల్.. ఆమె నా ఫేవరేట్' అని సమాధానమిచ్చాడు. కాసేపటి తర్వాత సన్నీలియోన్ పక్కన కూర్చున్న విష్ణుని అదే క్వశ్చన్ అడుగగా.. 'ఇంకెవరు.. సన్నీనే' అని ఆన్సర్‌‌ చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విష్ణు కూర్చుని ఉండగా అదే క్వశ్చన్ అడుగుతాడు పక్కన ఒకరు. ఈసారి కాసేపు ఆలోచించిన విష్ణు.. 'అలియా భట్' అని చెప్తాడు. దీంతో పక్కనున్న పాయల్‌, సన్నీ విష్ణుని బాదేశారు. ఈ వీడియోని పోస్ట్ చేసిన సన్నీలియోన్.. 'విష్ణుకి నేను, పాయల్ రాజ్‌పుత్ తగిన గుణపాఠం చెప్పాం' అని చెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విష్ణు (Vishnu Manchu), పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న గాలి నాగేశ్వరరావు సినిమాలోని ఒక పాటకు ఇండియన్‌ మైకేల్ జాక్సన్‌ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నాడు. చాలాకాలం తర్వాత ప్రభుదేవా తెలుగు సినిమాలోని పాటకు కొరియోగ్రఫీ చేస్తుండడంతో ఆ పాటపై అంచనాలు ఎక్కువయ్యాయి. కోన వెంకట్‌ కథ అందించి గాలి నాగేశ్వరరావు సినిమాకి అనూప్‌ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

కొంతకాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నాడు హీరో మంచు విష్ణు. తెలుగుతోపాటు ఇంగ్లీష్‌లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేసిన మోసగాళ్లు సినిమా కూడా విష్ణుకి బిగ్‌ బ్రేక్ ఇవ్వలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని కసిగా ఉన్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!