విష్ణు మంచు (Vishnu Manchu) ‘గాలి నాగేశ్వరరావు’ సినిమాలో పాట పాడిన కూతుళ్లు అరియానా, వివియానా

Updated on May 11, 2022 10:38 PM IST
మంచు విష్ణు (Manchu Vishnu) కూతుళ్లు అరియానా, వివియానా
మంచు విష్ణు (Manchu Vishnu) కూతుళ్లు అరియానా, వివియానా

మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా నటిస్తున్న సినిమా ‘గాలి నాగేశ్వరరావు’. మాస్ క్యారెక్టర్‌‌తో ఈసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడీ సొట్ట బుగ్గల హీరో. గాలి నాగేశ్వరరావు క్యారెక్టర్ రివీల్‌ చేసినప్పటి నుంచి సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మంచు విష్ణు పక్కన హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్‌ నటిస్తుండగా.. సన్నీ లియోన్‌ కీలకపాత్ర పోషిస్తోంది. చాలాకాలం తర్సవాత న్నీలియోన్ తెలుగులో నటిస్తోంది. ప్రస్తుతం వచ్చిన అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి.

               చాలా కాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇండియన్ మైఖేల్‌ జాక్సన్ ప్రభుదేవా.. గాలి నాగేశ్వరరావు సినిమాలో పాటకు కొరియోగ్రఫీ చేస్తుండడం మరో విశేషం. చాలాకాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నాడు మంచు విష్ణు. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్‌తోపాటు స్టార్ యాక్టర్లతో తీసిన మోసగాళ్లు సినిమా కూడా విష్ణును నిరాశపరిచింది. ఇక, ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని, దీంతో మరోసారి హిట్‌ ట్రాక్ ఎక్కాలని కసిగా ఉన్నాడు మంచు విష్ణు.

               సినిమా టైటిల్‌ అనౌన్స్​ చేసినప్పటి నుంచి సర్‌‌ప్రైజ్‌ల మీద సర్‌‌ప్రైజ్‌లు ఇస్తున్న చిత్ర యూనిట్..తాజాగా మరో సర్‌‌ప్రైజ్‌ను రివీల్‌ చేసింది.మంచు మోహన్‌బాబు మనుమరాళ్లు, విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా ఈ సినిమాతో సింగర్లుగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో ఒక పాటను అరియానా, వివియానా కలిసి ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం చేశాడు. సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది.

అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్​లో ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కోన వెంకట్ కథ, స్ర్కీన్ ప్లే, క్రియేటివ్ ప్రొడ్యూసర్​గా ఉన్నాడు. కెమెరామెన్‌గా చో టా.కె.నాయుడు, డైలాగ్స్ భాను, నందు డైలాగ్స్ అందిస్తున్నారు.   

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!