Kiran Abbavaram: 'సమ్మతమే' మూవీ ప్రమోషన్లను వినూత్నంగా నిర్వహిస్తున్న 'కిరణ్ అబ్బవరం'

Published on Jun 22, 2022 06:04 PM IST

సినిమా ఇండస్ట్రీలో కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కుకున్న నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో దూసుకెళ్తున్నాడు. ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సమ్మతమే’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు కిరణ్ అబ్బవరం రెడీ అవుతున్నాడు. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలకాగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. 

జూన్‌ 24న ‘సమ్మతమే’ (Sammathame Movie) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కిరణ్.. ఈ సినిమా ప్రమోషన్లను వినూత్న రీతిలో చేపట్టారు. ఇందులో భాగంగా.. కిరణ్ కాలేజీ పిల్లలతో కలిసి సందడి చేశారు. హైదరాబాద్ లో ఓ కాలేజీ బస్సు ఎక్కి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. కాగా, కిరణ్‌ గత సినిమాకు ఈ సినిమాకు మూడు నెలల గ్యాపే ఉంది. దీంతో వరుసగా సినిమాలు చేసేస్తూ వస్తున్నారు. దీని వల్ల మీ కెరియర్‌కు ఇబ్బంది అవుతుందేమో అని ఎప్పుడూ అనిపించలేదా అని అడిగితే.. సినిమాల విడుదల విషయంలో నా ప్రణాళిక సరైనదేనని భావిస్తున్నా అని చెప్పాడు. 

తాజాగా బుల్లితెరపై 'ఆలీతో సరదాగా' (Alitho Saradaga) అనే కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. మాది కడప జిల్లా రాయచోటి.. నేను కాలేజీలో చదువుకునే రోజులలో నీకు జాబు రాదు బస్టాండ్ లో బఠాణీలు అమ్ముకోవాల్సిందే అని లెక్చరర్స్ తిట్టే వారట. దాంతో తనకు జాబ్ రాలేదని అనుకునేవాడిని కానీ లక్కీగా మా క్లాసులో అందరికంటే ముందు తనకి జాబు వచ్చిందని తెలిపారు. 

Read More: Kiran Abbavaram: కిర‌ణ్ అబ్బ‌వరం హీరోగా 'రూల్స్ రంజన్'.. పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న డైరెక్ట‌ర్ క్రిష్!