Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం హీరోగా 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'.. ఆకట్టుకుంటున్న టీజర్!
టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఇటీవలే “సమ్మతమే” చిత్రంతో మంచి హిట్ అందుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆ సినిమా తర్వాత నటించిన సరికొత్త ఎంటర్‌టైనింగ్ మూవీ 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'. ఈ సినిమా శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తిరగకుతున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం కు జోడిగా సంజన ఆనంద్ (Sanjana Anand), సోనూ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ (Nenu Meeku Baga Kavaalsina vaadini Teaser) అయిన పోస్టర్లు, సాంగ్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే టీజర్ విడుదలైంది. టీజర్ చాలా ప్రామీసింగ్ గా ఉంది. ఇందులో కిరణ్ అబ్బవరం తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. "అంత ఆహ్లాదకరమైన కుటుంబం మీకు ఉన్నప్పుడు అందరూ కలిసి సరదాగా ఉగాది పచ్చడి తినకుండా ఇంతదూరం వచ్చి ఇంతలా ఎందుకు తాగుతున్నారు", "ఒక్క ప్రేమకే మీరిలా అయిపోతే ఎలా మేడమ్. పదిసార్లు ప్రేమలో ఓడిపోయినా సరే.. సిగ్గులేకుండా పదకొండోసారి ప్రేమ కోసం పరితపించే ప్రేమికుల మధ్య బతుకుతున్నాం" అంటూ కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) టాక్సీ డ్రైవర్ గా నటిస్తుండగా తన మార్క్ డైలాగ్ డెలివరీ మళ్ళీ ఈ సినిమాలో కనిపించింది. అంతే కాకుండా ఈ టీజర్ లో తాను మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అలాగే మంచి ఫన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తోంది. ఇంకా గెటప్ శ్రీను, బాబా భాస్కర్ మాస్టర్ లు అయితే మంచి సర్ప్రైజింగ్ గా కనిపిస్తున్నారు. అలాగే బాబా భాస్కర్ ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ సినిమాలో కనిపిస్తుండడం ఆసక్తిగా అనిపిస్తోంది.
బాబా భాస్కర్ (Baba Bhaskar), కిరణ్ అబ్బవరం మధ్య వచ్చే సన్నివేశాలు, పంచ్ డైలాగ్‌లు నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. టీజర్ చివర్లో.. "మామ కాబోయే అల్లుడితో జోకులు వేయమాక. రేపు సంక్రాంతి పండక్కి నువ్వు, నేనే ఇంట్లో కూర్చొని వడలు తినాల్సింది" అంటూ సాగే సంభాషణలు, ఫైట్ సీక్వెన్స్‌లు అలరిస్తున్నాయి. కిరణ్ అబ్బవరమే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
Read More: Kiran Abbavaram: 'సమ్మతమే' మూవీ ప్రమోషన్లను వినూత్నంగా నిర్వహిస్తున్న 'కిరణ్ అబ్బవరం'