Kiran Abbavaram: మాస్ లుక్ లో కిరణ్ అబ్బవరం.. ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ టీజర్ ఎప్పుడంటే..?

Updated on Jul 08, 2022 07:10 PM IST
కిరణ్ అబ్బవరం, ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ పోస్టర్ (Kiran Abbavaram, Nenu Meeku Baga Kavalsinavadini Poster)
కిరణ్ అబ్బవరం, ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ పోస్టర్ (Kiran Abbavaram, Nenu Meeku Baga Kavalsinavadini Poster)

టాలీవుడ్ యంగ్ హీరోల్లో వైవిధ్య భ‌రిత క‌థ‌ల‌ను ఎంచుకుంటూ సినీరంగంలో మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం (Kiran Abbavaram). 'రాజావారు రాణిగారు' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై.. తొలి సినిమాతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించాడు ఈ యంగ్‌ టాలెంటెడ్‌ హీరో. ఇటీవ‌లే ‘స‌మ్మ‌త‌మే’ చిత్రంతో మ‌రో హిట్‌ను సాధించాడు కిరణ్ అబ్బవరం. మూడు నెలల గ్యాప్ లో 'సెబాస్టియన్ పీసీ 524', 'సమ్మతమే' చిత్రాలను రిలీజ్ చేసి ఆడియెన్స్ అటెన్షన్ డ్రా చేశాడు కిరణ్. 

కాగా, ప్ర‌స్తుతం కిరణ్ అబ్బవరం చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ (Nenu Meeku Baga Kavalsinavadini) సినిమా కూడా ఒక‌టి. కోడి దివ్య నిర్మించిన ఈ సినిమాకి శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో కథానాయికగా సంజనా ఆనంద్ పరిచయం కానుంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా టీజర్ (Nenu Meeku Baga Kavalsinavadini Teaser) రిలీజ్ తేదీని, సమయాన్ని ప్రకటించారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 11:05 నిమిషాలకు ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర మేకర్స్. ఈ పోస్ట‌ర్‌లో కిర‌ణ్ గాగుల్స్ ధ‌రించి స్టైలిష్‌లుక్‌లో దర్శనం ఇచ్చాడు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. 

గతంలోనే ఈ చిత్రాన్ని ప్రకటించిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మూవీ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు చకాచకా కొనసాగుతున్నాయి. ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది. షూటింగ్ మొద‌లై నెల‌లు దాటుతున్న ఈ సినిమా గురించి అప్‌డేట్‌లు రావ‌డంలేదు. ఈ నేప‌థ్యంలోనే చిత్ర‌బృందం బిగ్ అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. 

Read More: Sammathame Movie: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న 'సమ్మతమే' మూవీ.. కలెక్షన్లు ఎంతంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!