ఏజెంట్ (Agent) గా యాక్ష‌న్ సీన్‌లో అదరగొడుతున్న అఖిల్ (Akhil Akkineni)

Updated on May 29, 2022 08:36 PM IST
 ఏజెంట్‌ (Agent) గా  అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హాలీవుడ్ రేంజ్‌లో క‌నిపించేలా ఫిజిక్ మెయిన్‌టెన్ చేస్తున్నాడు.
ఏజెంట్‌ (Agent) గా అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హాలీవుడ్ రేంజ్‌లో క‌నిపించేలా ఫిజిక్ మెయిన్‌టెన్ చేస్తున్నాడు.

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కోసం చూస్తున్నారు. ఏజెంట్ (Agent) సినిమాతో త‌న టాలెంట్ ఏంటో చూపించేందుకు సిద్ధం అవుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ త‌ర్వాత మ‌రింత జోష్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఏజెంట్ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత, డైరెక్టర్ వక్కంతం వంశీ క‌థ‌ను రాశారు. హిప్‌హాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం అక్కినేని అఖిల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ (Agent) సినిమా చేస్తున్నారు. చాలా లేట్‌గా వ‌స్తున్న లేటెస్ట్ క‌థ‌తో ఈ సినిమా రిలీజ్ కానుంది. యాక్ష‌న్ సినిమాగా ఏజెంట్ రానుంది. గ‌త ఏడాది నుంచి ఏజెంట్ సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. ఏజెంట్ సినిమా ఆగిపోయింద‌నే వార్త‌లు ఆ మ‌ధ్య హ‌ల్ చ‌ల్ చేశాయి. కానీ అక్కినేని అఖిల్ వ‌రుస పోస్టుల‌తో త‌న సినిమా షూటింగ్ వివ‌రాలు అభిమానుల‌కు తెలిసేలా చేస్తున్నారు.

ఏజెంట్ (Agent)  సినిమాలో స్టార్ హీరో ముమ్ముటి కూడా న‌టిస్తున్నారు. అఖిల్ త‌న బాడీ ఫిట్‌నెస్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఏజెంట్‌గా హాలీవుడ్ రేంజ్‌లో క‌నిపించేలా ఫిజిక్ మెయిన్‌టెన్ చేస్తున్నాడు. ఏజెంట్ సినిమా షూటింగ్‌లో అఖిల్ ఫోటో వైర‌ల్ అయింది. ఆ ఫోటోలో అఖిల్ తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు క‌నిపిస్తారు. ఏజెంట్‌గా అఖిల్ ఎలాంటి యాక్ష‌న్ సీన్ చేస్తున్నారో సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత చూడాలి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!