'బింబిసార‌'తో క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) కొత్త ప్ర‌యోగం.. ఫస్ట్ డే క‌లెక్ష‌న్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Updated on Aug 06, 2022 07:38 PM IST
Bimbisara: సినిమా బాగుంటే ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తానే క‌ల్యాణ్ రామ్ మాట బింబిసార సినిమాతో నిజ‌మైంది.
Bimbisara: సినిమా బాగుంటే ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తానే క‌ల్యాణ్ రామ్ మాట బింబిసార సినిమాతో నిజ‌మైంది.

Bimbisara: టాలీవుడ్ హీరో క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) న‌టించిన 'బింబిసార' క‌లెక్ష‌న్ల మోత మోగిస్తుంది. కొత్త ద‌ర్శ‌కుడు మల్లిడి వశిష్ట్ ద‌ర్శ‌క‌త్వం అదుర్స్ అంటున్నారు ప్రేక్ష‌కులు. సినిమా బాగుంటే ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తానే క‌ల్యాణ్ రామ్ మాట నిజ‌మైంది. 'బింబిసార' కోసం ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతున్నారు. సినిమా రిలీజ్‌కు ముందు నుంచే భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. అంచనాల‌కు త‌గ్గ‌ట్టుగానే బింబిసార కాసుల పంట పండిస్తుంది. 

క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) న‌టించిన 'ప‌టాస్' సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచింది. మ‌ళ్లీ ఏడేళ్ల త‌ర్వాత క‌ల్యాణ్ రామ్‌కు 'బింబిసార' బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చింది. క‌ల్యాణ్ రామ్ కెరీయ‌ర్‌లోనే అత్యంత స‌క్సెస్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. 'బింబిసార' మొద‌టి రోజు అదిరిపోయే క‌లెక్ష‌న్ రాబ‌ట్టింది. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ‘బింబిసార’ చిత్రాన్ని త‌నే స్వ‌యంగా నిర్మించారు. ఈ సినిమాకు మొద‌టి రోజు నుంచే ప్రేక్ష‌కుల నుంచి పాజిటీవ్ టాక్ వ‌చ్చింది. 'బింబిసార' తొలి రోజు క‌లెక్ష‌న్ చూస్తే దిమ్మ తిరిగే రేంజ్‌లో వ‌సూళ్లు రాబ‌ట్టింది. 

'బింబిసార' మొద‌టి రోజు వ‌సూళ్ల వివ‌రాలు

  • నైజాం - రూ. 2.15 కోట్లు
  • సీడెడ్  - రూ. 1.29 కోట్లు
  • ఉత్త‌రాంధ్ర  - రూ. 0.90 కోట్లు
  • ఈస్ట్  - రూ. 0.43 కోట్లు
  • వెస్ట్ - రూ. 0.36 కోట్లు
  • గుంటూరు  - రూ. 0.57 కోట్లు
  • కృష్ణా  - రూ. 0.34 కోట్లు
  • నెల్లూరు - రూ. 0.26 కోట్లు
  • తెలుగు రాష్ట్రాల్లో - రూ. 6.30 కోట్లు (9.30 కోట్ల గ్రాస్‌)
  • ప్ర‌పంచ వ్యాప్తంగా - రూ. 7.30 కోట్లు (11.5 కోట్ల గ్రాస్)

‘బింబిసార’ చిత్రానికి రూ.16 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ జ‌రిగింది. మొద‌టి రోజే ఈ చిత్రం రూ.7.3 కోట్ల షేర్‌ను సాధించింది. ఇక‌ మ‌రో 9.2 కోట్ల షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్‌ను పూర్త‌వుతుంది. రాబోయే వీకెండ్‌లో ఈ సినిమా భారీగా వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని అంచ‌నా. 'బింబిసార'కు సీక్వెల్ భారీ స్థాయిలో ఉంటుంద‌ని.. రెండో భాగంలో త‌న త‌మ్ముడు ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుంద‌ని క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) స‌క్సెస్ మీట్‌లో తెలిపారు. 

Read More: బింబిసార (Bimbisara) సీక్వెల్‌లో నా త‌మ్ముడు ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుంది : క‌ల్యాణ్ రామ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!