Bimbisara: 'బింబిసార' కోసం క‌ల్యాణ్ రామ్ త‌న‌ ర‌క్తాన్ని ధార పోశారు - ఎన్టీఆర్ (NTR)

Updated on Jul 30, 2022 04:27 PM IST
Bimbisara: 'బింబిసార' కేవ‌లం నా అన్న‌య్య‌ క‌ల్యాణ్ రామ్ వ‌ల్లే సాధ్య‌మైంది.. ఈ సినిమా కోసం క‌ల్యాణ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు - ఎన్టీఆర్ (NTR).
Bimbisara: 'బింబిసార' కేవ‌లం నా అన్న‌య్య‌ క‌ల్యాణ్ రామ్ వ‌ల్లే సాధ్య‌మైంది.. ఈ సినిమా కోసం క‌ల్యాణ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు - ఎన్టీఆర్ (NTR).

టాలీవుడ్ హీరో క‌ల్యాణ్ రామ్ (Kalyan Ram) న‌టించిన 'బింబిసార' ఆగ‌స్టు 5న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో 'బింబిసార' ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ (NTR) హాజ‌ర‌య్యారు. 'బింబిసార' చిత్రం గురించి ఎన్టీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. క‌ల్యాణ్ రామ్ గురించి ఎన్టీఆర్ ఏమ‌న్నారు?. తెలుగు సినిమా రంగంపై ఎన్టీఆర్ చేసిన ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ ఏంటి?. 'బింబిసార' ప్రీ రిలీజ్ విశేషాలు...

బింబిసార' క‌ల్యాణ్‌రామ్‌తోనే సాధ్య‌మైంది : ఎన్టీఆర్

'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ (NTR) ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలిపారు. 'బింబిసార' కోసం త‌న అన్న‌య్య క‌ల్యాణ్‌రామ్ ర‌క్తాన్ని ధార‌పోశార‌న్నారు. అంతేకాదు 'బింబిసార' సినిమా కేవ‌లం క‌ల్యాణ్ రామ్‌తోనే సాధ్య‌మైందని అభిప్రాయపడ్డారు.  అభిమానులు కాల‌ర్ ఎగ‌రేసుకునేలా చేయ‌డ‌మే త‌మ బాధ్య‌త‌న్నారు.

'బింబిసార' సినిమా త‌ర్వాత, క‌ల్యాణ్ రామ్ రేంజ్ మ‌రింత పెరుగుతుందని ఎన్టీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. 'బింబిసార' కోసం క‌ల్యాణ్ రామ్ అహర్నిశలు ఎంతో శ్రమించారని తెలిపారు. ఓ న‌టుడిగా క‌ల్యాణ్ రామ్ త‌న‌ను తాను మ‌లుచుకున్నార‌ని ప్ర‌శంసించారు. తామిరువురం ఎప్పటికీ  ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమాలు చేస్తూనే ఉంటామ‌న్నారు ఎన్టీఆర్ (NTR).

Bimbisara: 'బింబిసార' కేవ‌లం నా అన్న‌య్య‌ క‌ల్యాణ్ రామ్ వ‌ల్లే సాధ్య‌మైంది.. ఈ సినిమా కోసం క‌ల్యాణ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు - ఎన్టీఆర్ (NTR).

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఊపిరి పోయండి : ఎన్టీఆర్

అద్భుత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తార‌ని ఎన్టీఆర్ అన్నారు. 'బింబిసార‌'ను కూడా అలాగే ఆద‌రించాల‌న్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు కొత్త ఊపిరి పోయాల‌ని.. ప‌ది కాలాల పాటు చ‌ల్ల‌గా ఉండేలా చేయాల‌ని దేవుడితో పాటు ప్రేక్ష‌కుల‌ను కోరుకుంటున్నాన‌ని ఎన్టీఆర్ (NTR) తెలిపారు.

‘బింబిసార’ టీజర్‌తోనే వేణు టాలెంట్ ఏంటో తెలిసింద‌న్నారు. స‌రికొత్త‌గా పాట‌ల‌ను అందించిన కీర‌వాణిగారికి కృత‌జ్ఞ‌త‌ల‌ని తెలిపారు. తాత ఎన్టీఆర్, నాన్న హ‌రికృష్ణ‌లు త‌మ‌కు ఇచ్చిన‌ అభిమానులకు ఎప్పుడూ రుణ‌ప‌డి ఉంటామ‌న్నారు.

'బింబిసార' ఓ మంచి సినిమా - క‌ల్యాణ్ రామ్

ఓ మంచి జాన‌ప‌ద చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు 'బింబిసార' రూపంలో తీసుకొస్తున్నామ‌ని హీరో క‌ల్యాణ్ రామ్ అన్నారు. 'బింబిసార' చిత్రంతో అభిమానులు సంతృప్తి చెందుతార‌న్నారు.  అభిమానులు గ‌ర్వించేలా ఈ చిత్రం ఉంటుంద‌న్నారు. సినిమాకు ప్రాణం పోసిన కీర‌వాణికి, త‌న‌కు ఈ చిత్రాన్ని అందించిన కె.హ‌రికృష్ణ‌కు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని క‌ల్యాణ్ రామ్ పేర్కొన్నారు.

 

Bimbisara: 'బింబిసార' కేవ‌లం నా అన్న‌య్య‌ క‌ల్యాణ్ రామ్ వ‌ల్లే సాధ్య‌మైంది.. ఈ సినిమా కోసం క‌ల్యాణ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు - ఎన్టీఆర్ (NTR).

'బింబిసార' (Bimbisara) లో ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. కేథరిన్, సంయుక్త మీనన్, వార్నియా హుస్సేన్‌లు కథానాయిక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ కీల‌క పాత్ర‌లలో క‌నిపించ‌నున్నారు. మ‌ల్లాది వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. 'బింబిసార' చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. 'బింబిసార' చిత్రం ఆగస్టు 5 వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. 

Read More: బింబిసార (Bimbisara) సీక్వెల్‌లో నా త‌మ్ముడు ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుంది : క‌ల్యాణ్ రామ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!