‘అవతార్ 2’ (Avatar 2) సినిమా కోసం డైలాగ్ రైటర్ గా టాలీవుడ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas)..!

Updated on Dec 13, 2022 03:33 PM IST
అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas).. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas).. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

తెలుగు మూవీ లవర్స్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న సినిమా ‘అవతార్ 2’ (Avatar 2). దాదాపు 13ఏళ్ళ క్రితం వచ్చిన అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 2009లో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ కు ఇప్పుడు సీక్వెల్‌ వచ్చేస్తోంది. 

‘అవతార్ 2’ (Avatar 2) సినిమా డిసెంబర్‌ 16న విడుదలకు సిద్ధమైంది. దాదాపు ప్రపంచంలోని ఎక్కువ భాషల్లో డబ్బింగ్‌ అవుతున్న ‘అవతార్‌2’ (ద వే ఆఫ్‌ వాటర్‌)ను తెలుగులో కూడా అనువదిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకి వచ్చింది. టాలీవుడ్ రైటర్, డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్.. ఈ సినిమాలో భాగమయ్యాడు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి ఈ తెలుగు రచయిత మాటలు రాశాడు. 

అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas).. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఆయన.. రచయితగా, దర్శకుడిగానూ తనదైన శైలిలో మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా ఎక్కువ తెలుగు పదాలను ఉపయోగిస్తూ ఆయన రాసే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇతర భాషల్లో రూపొందుతున్న భారీ చిత్రాల తెలుగు వెర్షన్ కు కూడా ఆయన డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. మరి, అవసరాల మాటలతో ‘అవతార్ 2’ సినిమా ఎలా ఉండబోతుందో ఈ శుక్రవారం థియేటర్లో చూడాల్సిందే.

అయితే, సాధారణంగా డబ్బింగ్ సినిమాల కోసం హనుమాన్ చౌదరి, వెన్నెలకంటి లాంటి వారు పనిచేస్తుంటారు. కానీ ఓ స్టార్ డైరెక్టర్, డైలాగ్ రైటర్ గా మారడం మాత్రమే ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Read More: Avatar: The Way of Water: 'అవతార్2' లో కొత్త పాత్రలను పరిచయం చేయనున్న దర్శకుడు జేమ్స్ కామెరాన్

Advertisement
Credits: Pinkvilla, Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!