Avatar: The Way of Water: 'అవతార్2' లో కొత్త పాత్రలను పరిచయం చేయనున్న దర్శకుడు జేమ్స్ కామెరాన్

Updated on Dec 13, 2022 04:17 PM IST
Avatar: The Way of Water: 'అవతార్' సినిమా రిలీజ్ అయిన 13 ఏళ్ల తరువాత సీక్వెల్‌గా 'అవతార్ - ది వే ఆఫ్ వాటర్' డిసెంబర్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 
Avatar: The Way of Water: 'అవతార్' సినిమా రిలీజ్ అయిన 13 ఏళ్ల తరువాత సీక్వెల్‌గా 'అవతార్ - ది వే ఆఫ్ వాటర్' డిసెంబర్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

Avatar: The Way of Water : హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ సినీ ప్రపంచంలో సృష్టించిన అద్భుతం 'అవతార్'. ప్రపంచంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన 'అవతార్' సినిమాను 2009లో రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన 13 ఏళ్లకు సీక్వెల్‌గా 'అవతార్ - ది వే ఆఫ్ వాటర్' (Avatar: The Way of Water) డిసెంబర్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

ప్రకృతినే దైవంగా భావించే పండోరా జాతి గురించి తెలిపే కథతో జేమ్స్ కామెరాన్ అవతార్ చిత్రాన్ని రూపొందించారు. జేక్ సల్లీ అనే వ్యక్తిని టెక్నాలజీ సహాయంతో పండోరా రూపంలోకి మార్చి .. వారి గురించి విశేషాలను తెలుసుకునే ప్రయత్నాలతో అవతార్ కథ సాగింది. 

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

జేక్ సల్లీ పండోరా రాణి నేత్రీతో ప్రేమలో పడతాడు. మనిషి రూపం నుంచి పండోరాగా జేక్ మారతాడు.  జేక్ సల్లీ తన భార్య నేత్రీతో కలిసి పండోరా జాతిని రక్షించే ప్రయత్నాలను అవతార్ 2 చిత్ర కథ. అయితే ఈ సారి యుద్ధం భూమిపైన కాదు. నీటి అడుగున జరిగే కథను జేమ్స్ కామెరాన్ టెక్నాలజీతో అద్భుతంగా తెరకెక్కించారు. అవతార్ - ది వే ఆఫ్ వాటర్ చిత్రంలో కొత్త పాత్రలు కూడా కనువిందు చేయనున్నాయి. ఈ సినిమాలోని పాత్రలపై పింక్ విల్లా ప్రత్యేక కథనం..

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

అవతార్ హీరో- సామ్ వర్థింగ్టన్ 

అవతార్ చిత్రంలో హీరో పాత్రను పోషించిన నటుడు సామ్ వర్థింగ్టన్. వర్థింగ్టన్ ఇంగ్లాండ్‌లో పుట్టారు. ఆరేళ్ల వయసులో ఇతని తల్లిదండ్రులు ఉద్యోగ రిత్యా ఆస్ట్రేలియాకు వచ్చేశారు. పవర్ ప్లాంట్ ఉద్యోగిగా కెరీయర్ మొదలు పెట్టిన సామ్ వర్థింగ్టన్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటనపై ఆసక్తితో యాక్టర్ అయ్యారు. అవతార్ సినిమాతో ప్రపంచంలోనే ఫేమస్ హీరోగా పేరు సంపాదించుకున్నారు.

సామ్ వర్థింగ్టన్ అవతార్ సినిమాలో జేక్ సల్లీ పాత్రలో నటించారు. పండోరీ జాతికి చెందిన నేత్రీతో ప్రేమలో పడిన జేక్ ఆమెతోనే జీవితం సాగించాలనుకుంటారు.  జేక్, నేత్రీల ప్రేమ ప్రయాణం, కుటుంబం గురించిన ఆసక్తి విషయాలతో అవతార్ - ది వే ఆఫ్ వాటర్ సినిమాను దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించారు. 

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

పండోరా రాణి -జో సల్దానా

పండోరా జాతి రాజు కుమార్తె నేత్రీ పాత్రలో జో సల్ధానా నటించారు. అవతార్ 2 చిత్రంలో దత్తత తీసుకున్న కుమార్తెతో పాటు ముగ్గురు పిల్లలకు తల్లిగా జో కనిపించనున్నారు. జేక్ సల్లీ భార్యగా, పండోరా రక్షకురాలిగా జో సల్దానా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఆసక్తికర అంశాలతో అవతార్ 2 సినిమా కథ సాగనుంది. 

 

 

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

దత్త పుత్రిక

జేక్, నేత్రీల దత్తపుత్రిక కిరీ పాత్రలో సిగోర్నీ వీవర్ నటించారు. అవతార్ సినిమాలో డాక్టర్ గ్రేస్ అగస్టిస్‌గా కనిపించిన వీవర్.. సీక్వెల్‌లో కొత్త పాత్రలో కనిపించనున్నారు. సిగోర్నీ వీవర్ ఫ్రీ డైవింగ్ నేర్చుకున్నారు.  

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

విలన్!

కల్నల్ మైల్స్ పాత్రలో స్టీఫెన్ లాంగ్ నటించారు. మైనింగ్ ఆపరేషన్‌కు సెక్యూరిటీ డిటె‌యిల్స్ హెడ్‌గా స్టీఫెన్ లాంగ్ కనిపించారు. సీక్వెల్ పాత్రలో మెయిన్ విలన్ పాత్రలో లాంగ్ కనిపించనున్నారు. 

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

సముద్ర రాణి - టైటానిక్ హీరోయిన్ కేట్

టైటానిక్ హీరోయిన్ కేట్ ఎలిజిబెత్ విన్ స్లెట్ అవతార్2లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. సముద్ర జాతికి చెందిన మెట్‌కయినా రాజు భార్యగా కేట్ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం కేట్ ఫ్రీ - డైవింగ్ కూడా నేర్చుకున్నారు. సముద్రం గురించి కేట్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చు.. అందుకనే దర్శకుడు జేమ్స్ సముద్రంలో నివసించే మెట్‌కయినా జాతి రాణి రోనాల్‌గా కేట్‌ను ఎంపిక చేసుకున్నారు. 

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

కేట్ భర్త పాత్రలో కర్టిస్

క్లిఫ్ కర్టిస్ న్యూజిలాండ్ నటుడు. అవతార్ 2 సినిమాలో మెట్‌కయినా నాయకుడిగా కర్టిస్ నటిస్తున్నారు. అందాల రాణి రోనాల్ భర్తగా వెండితెరపై నటించనున్నారు. 

అవతార్ - ద వే ఆఫ్ వాటర్

అవతార్ 2లో అద్భుతాలు

జేక్, నేత్రీల పెద్ద కుమారుడు నేతేయం పాత్రలో జామీ ఫ్లాటర్స్ నటిస్తున్నారు. బ్రిటన్ డాల్టన్ చిన్న కుమారుడు లోయాక్ పాత్రలో కనిపించనున్నారు.ట్రినిటీ జో - లి బ్లిస్ చిన్న కుమార్తె టుక్ పాత్రలో నటిస్తున్నారు.

సముద్రంలో జీవించే మెట్‌కయినా తెగకు చెందిన రోనాల్ రాణి కుమారుడిగా ఫిలిప్స్.. కుమార్తెగా బెయిలీ కనిపించనున్నారు.

 "అవతార్ 2"  (Avatar : The Way of Water)  సినిమాలో పండోరాతో పాటు మెట్‌కయినా జాతికి చెందిన వారి కథను దర్శకుడు జేమ్స్ కామెరాన్ చిత్రీకరించారు. మెట్‌కయిన్లు పండోరాలకు సముద్రంలో యుద్ధం జరిగిందా.. లేక వీరిద్దరూ కలిసి శత్రువులను మట్టుబెట్టారా అనేది తెలియాలంటే అవతార్ - ది వే ఆఫ్ వాటర్ సినిమాను డిసెంబర్ 16 న థియేటర్లలో 3డీలో చూడాల్సిందే..

Read More: Avatar : The Way of Water : "అవతార్ 2" సినిమా టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!