Pushpa: 'పుష్ప' బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అంటున్న ర‌ష్యా!.. హీరోయిజంలో అల్లు అర్జున్ (Allu Arjun)  త‌గ్గేదేలే !

Updated on Sep 02, 2022 08:00 PM IST
మాస్కో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన 'పుష్ప' చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు.
మాస్కో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్‌లో అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన 'పుష్ప' చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు.

Pushpa: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన 'పుష్ప' ఓ రేంజ్‌లో స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. 'పుష్ప' సినిమా త‌రువాత అల్లు అర్జున్  ఉత్తరాదిలో మరింత పాపుల‌ర్ అయ్యారు. 'పుష్ప' సినిమా ఇటీవలే మ‌రో అరుదైన రికార్డును సాధించింది. మాస్కో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్‌లో 'పుష్ప' చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఈ విష‌యాన్ని మాస్కోలోని భార‌త రాయ‌భార కార్యాల‌యం సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది. 

'పుష్ప' బ్లాక్ బాస్ట‌ర్ హిట్  : ర‌ష్యా

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రిలీజ్ అయిన 'పుష్ప' అల్లు అర్డున్‌ (Allu Arjun) కు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చింది. అల్లు అర్జున్ 'పుష్పరాజ్' పాత్రలో కనబరిచిన న‌ట‌న‌కు సౌత్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు వ‌చ్చింది. పుష్ప సినిమా బాక్సాఫీసు వద్ద క‌లెక్ష‌న్ల సునామీని సృష్టించింది. హిందీలోనూ ఈ సినిమా రికార్డుల‌ను తిరగరాసింది.

'పుష్ప' సినిమాకు ర‌ష్యా దేశంలో అరుదైన ఘ‌న‌త ద‌క్కింది. ఈ సందర్భంగా "పుష్ప చిత్రం ప్ర‌పంచంలోనే బ్లాక్ బాస్ట‌ర్ హిట్" అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు .  'పుష్ప' సినిమాను ఇంగ్లీష్, ర‌ష్య‌న్ భాష‌లలో స‌బ్ టైటిల్స్‌తో ఆగ‌స్టు 30 తేదీన ప్ర‌ద‌ర్శించారు.

కాసుల‌ వ‌ర్షం కురిపించిన పుష్ఫ‌

Pushpa: 'పుష్ప' ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.350 కోట్లను వ‌సూళ్లు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ బాలీవుడ్‌లో రూ.100 కోట్లు కలెక్ట్‌ చేసింది. 'పుష్ప' సినిమాను నార్త్ ప్రేక్ష‌కులు సూప‌ర్ హిట్ చేశారు. నార్త్‌లో అల్లు అర్జున్ ఈ సినిమాతో బాగా పాపుల‌ర్ అయ్యారు. అంతేకాకుండా అల్లు అర్జున్ డైలాగులు, పాట‌లు నార్త్ ఇండియాలో కూడా తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి

'పుష్ప' సినిమా పాన్ ఇండియాలో సూపర్ హిట్ కావడంతో, అదే చిత్రానికి సీక్వెల్‌గా 'పుష్ప 2' చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు.  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ర‌ష్మిక మంద‌న్న 'పుష్ప - ది రూల్' చిత్రంలో హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

Read More: Allu Arjun: న్యూయార్క్ లో అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం.. పుష్ప (Pushpa) డైలాగ్ తో అదరగొట్టిన బన్నీ..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!