Vijay Sethupathi: 'పుష్ప 2'లో అల్లు అర్జున్ కి విలన్ గా కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.. క్లారిటీ ఇదే!

Updated on Aug 16, 2022 10:27 AM IST
విజయ్​ సేతుపతి 'పుష్ప-2' (Pushpa 2) లో నటించడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మీడియాలో వచ్చేవన్ని ఊహాగానాలేనని కొట్టిపారేశాయి.
విజయ్​ సేతుపతి 'పుష్ప-2' (Pushpa 2) లో నటించడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మీడియాలో వచ్చేవన్ని ఊహాగానాలేనని కొట్టిపారేశాయి.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) తెరకెక్కించిన 'పుష్ప' (Pushpa) చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‏ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్నా జంటగా నటించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. తెలుగు, తమిళం మ‌ల‌యాళం, హిందీతోపాటు మిగిలిన భాష‌ల్లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో పాటు క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది.

పుష్ప సినిమాలో ముఖ్యంగా బన్నీ మాస్ ​గెటప్​, నటన, డైలాగ్స్​, సాంగ్స్​, డైరెక్టర్ సుకుమార్​ టేకింగ్, సెన్సేషనల్ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్​ మ్యూజిక్​​ సినిమాకే హైలైట్ ​గా నిలిచాయి. స్టార్​ హీరోయిన్​ సమంత (Samantha) చిందులేసిన 'ఊ అంటావా మావ' స్పెషల్​ సాంగ్​ దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. 

నేషనల్ క్రష్ ర‌ష్మిక మందన్నా (Rashmika Mandanna) ఈ చిత్రంలో శ్రీవ‌ల్లిగా డీ గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించి.. ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది.

ఇక, నేషనల్ క్రష్ ర‌ష్మిక మందన్నా (Rashmika Mandanna) ఈ చిత్రంలో శ్రీవ‌ల్లిగా డీ గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించి.. ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్​ మీడియాలో, ఇంటా బయటా ఎక్కడ చూసినా పుష్ప ఫీవరే. రీల్స్, సాంగ్స్​, డైలాగ్స్ తో నెటిజన్లు తగ్గేదేలే అంటూ తెగ సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా సినీ అభిమానులు 'పుష్ప-2' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఈ క్రమంలో 'పుష్ప' సినిమా భారీ విజయం సాధించాక.. రెండో భాగాన్ని అంతకు మించిన స్థాయిలో రూపొందించాలని చిత్ర బృందం భావిస్తోంది. త్వరలోనే పుష్ప సెకండ్ పార్ట్ పట్టాలెక్కనుంది. అయితే గత కొద్దిరోజులుగా ఈ మూవీలో మరో ఇద్దరు స్టార్స్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi). 

విజయ్ సేతుపతి (Vijay Sethupathi)

ప్రత్యేక పాత్రలకు కేరాఫ్​ అడ్రస్ గా నిలుస్తున్న విజయ్​ సేతుపతి ఈ సినిమాలో విలన్​ పాత్రలో నటించనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కానీ, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. విజయ్​ సేతుపతి 'పుష్ప-2' (Pushpa 2) లో నటించడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మీడియాలో వచ్చేవన్ని ఊహాగానాలేనని కొట్టిపారేశాయి. 

ఇంతకీ విషయమేంటంటే, 'పుష్ప 2' (Pushpa 2) సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతున్నాడని గత కొన్నాళ్లుగా మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సన్నిహిత వర్గాలు మీడియాకు అధికారిక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదేంటంటే, విజయ్ బాలీవుడ్ మూవీ "జవాన్" లో తప్పించి మరే ఇతర సినిమాలోనూ ప్రస్తుతానికైతే విలన్ గా నటించడం లేదని వివరించారు. దీంతో 'పుష్ప ది రూల్'పై వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లే అని తేలింది.

Read More: Allu Arjun: రూ.10 కోట్ల యాడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్.. ఆఫర్ ను తిరస్కరించిన ఐకాన్ స్టార్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!