Pushpa 2 : 'పుష్ప 2' బిగ్ అప్ డేట్ రిలీజ్!..  మామయ్య‌ బ‌ర్త్ డే రోజు అల్లుడు బ‌న్ని (Allu Arjun) సర్‌ప్రైజ్‌

Updated on Aug 21, 2022 07:03 PM IST
అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప 2' సినిమా షూటింగ్ పూజా కార్య్ర‌మాలు ఆగ‌స్టు 22న నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 
అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప 2' సినిమా షూటింగ్ పూజా కార్య్ర‌మాలు ఆగ‌స్టు 22న నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన 'పుష్ప' ఓ రేంజ్‌లో స‌క్సెస్ సాధించింది. 'పుష్ప' సినిమాకు సీక్వెల్‌గా 'పుష్ప - ది రూల్' ను ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్ డేట్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అప్ డేట్‌తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. 

చిరు బ‌ర్త్ డే రోజున బ‌న్ని సినిమా స్టార్ట్‌!

'పుష్ప' సినిమాకు సీక్వెల్ ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. ఈ సినిమా కోసం సుకుమార్ భారీగానే క‌స‌ర‌త్తు చేశారు. 'పుష్ప 2' ఎప్పుడెప్పుడు ప‌ట్టాలెక్కుతుందా అని బ‌న్ని అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూశారు. ఈ నేప‌థ్యంలో 'పుష్ప 2' నుంచి బిగ్ అప్ డేట్‌ను రిలీజ్ చేశారు. 'పుష్ప 2' సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా షూటింగ్ పూజా కార్య్ర‌మాలు ఆగ‌స్టు 22న నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగ‌స్టు 22. ఈ నేప‌థ్యంలో మేన‌ల్లుడు అల్లు అర్జున్ సినిమా 'పుష్ప 2'కు సంబంధించిన షూటింగ్ ప్రారంభించాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించారు. దీంతో సోష‌ల్ మీడియాలో 'పుష్ప 2' వివ‌రాల‌ను పోస్ట్ చేశారు. 

'పుష్ప - ది రూల్' సినిమా కూడా పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూ. 350 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్, ముత్తంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ర‌ష్మిక మంద‌న్న 'పుష్ప - ది రూల్' చిత్రంలో హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు.  

Read More: పుష్ప‌ 2 (Pushpa 2) : బడా స్టార్లతో పోటీగా.. సంక్రాంతి బ‌రిలోకి అల్లు అర్జున్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!