పుష్ప‌ 2 (Pushpa 2) : బడా స్టార్లతో పోటీగా.. సంక్రాంతి బ‌రిలోకి అల్లు అర్జున్ !

Updated on Jun 12, 2022 12:02 PM IST
సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుందట.
సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుందట.

పుష్ప (Pushpa) సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత హీరోగా అల్లు అర్జున్ (Allu Arjun) రేంజ్ మరింత పెరిగింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అయిన పుష్ప ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో 'పుష్ప 2' సినిమా రానుంది. 'పుష్ప 2' సినిమా రెగ్యుల‌ర్ షూట్ త్వ‌ర‌లో  ప్రారంభం కానుంద‌ట‌. 

పాన్ ఇండియాని షేక్ చేసిన పుష్ప

'పుష్ఫ - ది రైజ్' సినిమా ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో  బ్లాక్ బాస్ట‌ర్ హిట్  కొట్టింది. హిందీ హక్కులను సొంతం చేసుకున్న నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ప్ర‌తీ చోట 'త‌గ్గేదేలే' అంటూ అల్లు అర్జున్ (Allu Arjun) డైలాగులు మారుమోగ్రాయి. అంతేకాదు 'ఊ అంటావా.. ఊఊ అంటావా' ' శ్రీవ‌ల్లి'  మొదలైన సాంగ్స్ కుర్రకారును ఉర్రూతలూగించాయి.  ఈ సినిమా క‌లెక్ష‌న్ల ప‌రంగా వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూళ్లు చేసి భారతీయ సినిమా చరిత్రలోనే ఒక కొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. 

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) సినిమా రెగ్యుల‌ర్ షూట్ త్వ‌ర‌లో స్టాట్ కానుంద‌ట‌. 

హిాందీలో అల్లు అర్జున్ కు పెరిగిన ఫాలోయింగ్

ప్ర‌స్తుతం 'పుష్ప 2 - ది రూల్ ' అనే టైటిల్‌తో ద‌ర్శ‌కుడు సుకుమార్ మ‌రో పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.  పుష్ప‌కు మించి పుష్ప‌ 2 లో  అల్లు అర్జున్ (Allu Arjun)మాస్ యాక్ష‌న్ ఉండేలా ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ర‌ష్మిక మంద‌న 'పుష్ప 2 'లో కూడా అల్లు అర్జున్‌కు జోడిగా న‌టించ‌నున్నారు. సంక్రాంతికి 'పుష్ప 2 ' ను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.  

ఇప్ప‌టివ‌ర‌కు 'పుష్ప 2 ' సినిమాకు స్కిప్ట్ వ‌ర్క్ జరిగింది. దర్శకుడు దీనిని సాధ్యమైనంత త్వరగా ప‌ట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. జూలై చివ‌రి వారంలో అల్లు అర్జున్ 'పుష్ప 2 ' సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌కు హాజ‌ర‌వుతారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. నిర్మాత‌లు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ 'పుష్ప 2 ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) సినిమా రెగ్యుల‌ర్ షూట్ త్వ‌ర‌లో స్టాట్ కానుంద‌ట‌. 

'పుష్ప 2 - ది రూల్' సినిమాను రూ. 400 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. ఇదే చిత్రానికి, అల్లు అర్జున్ (Allu Arjun) రూ. 100 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నార‌ట‌. ఇక ద‌ర్శ‌కుడు సుకుమార్.. హీరో తీసుకున్న దానిలో సగం అంటే.. రూ. 50 కోట్ల రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేశార‌ని టాక్.  ఫాహద్ ఫాసిల్, సునిల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ బండారి, రావు రమేశ్, ధనంజయ్, అజయ్ మొదలైనవారు 'పుష్ప‌ 2' లో  నటించనున్నారు. 

Read More: అల్లు అర్జున్ తన వైఫ్ స్నేహతో కలిసి ప్లాన్ చేసిన.. రొమాంటిక్ డేట్ నైట్ విశేషాలు మీకోసం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!