Pushpa 2: పుష్ఫ‌2 ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని వంద‌ల కోట్లా!

Updated on May 15, 2022 11:26 AM IST
Pushpa 2:  టాలీవుడ్ క్రీజీ స్టార్ అల్లు అర్జున్ పుష్ఫ‌2 రిలీజ్‌కు ముందే వంద‌ల కోట్ల బిజినెస్
Pushpa 2: టాలీవుడ్ క్రీజీ స్టార్ అల్లు అర్జున్ పుష్ఫ‌2 రిలీజ్‌కు ముందే వంద‌ల కోట్ల బిజినెస్

Pushpa 2: టాలీవుడ్ క్రీజీ స్టార్ అల్లు అర్జున్ పుష్ఫ‌2 రిలీజ్‌కు ముందే వంద‌ల కోట్ల బిజినెస్ చేస్తుంది. డైరెక్ట‌ర్ సుకుమార్ పుష్ప సినిమాకూ సీక్వెల్‌గా పుష్ఫ‌2 తీస్తున్నారు. బాలీవుడ్‌లోనూ పుష్ఫ సినిమా క‌లెక్ష‌న్ల ప‌రంగా సునామీ సృష్టించింది. 

అల్లు అర్జున్ (Allu Arjun), ర‌ష్మిక మంద‌నా న‌టించిన పుష్ఫ ఇండియన్ సినిమాలో పెద్ద హిట్ సాధించింది. ప్ర‌మోష‌న్ల హ‌డావుడి లేకుండానే వంద‌ల కోట్ల రూపాయ‌ను కొల్ల‌గొట్టింది పుష్ప‌. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ త‌గ్గేదేలే అన్న‌ట్లు ఉన్నాయి. ర‌ష్మిక  డీ గ్లామ‌ర్ రోల్‌లో మెప్పించింది. పుష్ఫ స్టోరీ, మ్యూజిక్ , డైలాగ్స్ థియేట‌ర్ల‌ను ద‌ద్ద‌రిల్లేలా చేశాయి.  దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. 

పుష్ప: ది రైజ్‌తో బాలీవుడ్‌లో అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. వంద కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల గొట్టి హిందీలో రికార్డు సృష్టించింది. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ అల్లు అర్జున్ ఫేమ‌స్ అయ్యారు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. 

పుష్ఫ సినిమా సీక్వెల్ పుష్ఫ‌2 (Pushpa 2) రిలీజ్‌కు ముందే వంద‌ల కోట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంటుంది. బీభ‌త్స‌మైన యాక్ష‌న్ సినిమాగా పుష్ప‌2 ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.700 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింద‌ట‌. తెలుగు రాష్ట్రాలలో రూ. 200 కోట్లు, నార్త్ బెల్ట్ లో రూ. 200 కోట్లు, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రూ. 300 కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది. పుష్ప‌2 సినిమాను మే 2023లో రిలీజ్ చేస్తార‌ని టాక్. సంవ‌త్స‌రం త‌ర్వాత రిలీజ్ అయ్యే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా ఎంత వ‌సూళ్లు చేసి రికార్డు బ‌ద్ద‌లు కొడుతుందో చూడాలి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!