Ugram : 'ఉగ్రం' సినిమాతో న‌ట విశ్వ‌రూపం చూపించ‌నున్న అల్ల‌రి న‌రేష్ (Allari Naresh)

Updated on Sep 05, 2022 12:16 PM IST
అల్ల‌రి న‌రేష్ (Allari Naresh) 'ఉగ్రం' సినిమా షూటింగ్ మొద‌లైందంటూ మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు.
అల్ల‌రి న‌రేష్ (Allari Naresh) 'ఉగ్రం' సినిమా షూటింగ్ మొద‌లైందంటూ మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు.

Ugram : టాలీవుడ్ హీరో అల్ల‌రి న‌రేష్ (Allari Naresh) 'నాంది' సినిమాలో విభ‌న్న‌మైన పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. 'నాంది' త‌ర‌హా సినిమా ఉగ్రంలో న‌రేష్ త‌న విశ్వ‌రూపం చూప‌నున్నారు. ఈ సినిమాలో న‌రేష్ సీరియ‌స్ రోల్‌లో న‌టించ‌నున్నారు. 'ఉగ్రం' సినిమా షూటింగ్ మొద‌లైందంటూ మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. 'ఉగ్రం' సినిమా ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. ఈ సినిమాలో మ‌ల‌యాళ హీరోయిన్ న‌టిస్తున్నారు.

'ఉగ్రం' మొద‌లైంది

'ఉగ్రం' సినిమా షూటింగ్ మొద‌టంటూ మేక‌ర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో న‌రేష్ ఉగ్ర‌రూపంలో క‌నిపించారు.అల్ల‌రి న‌రేష్ (Allari Naresh) మొఖమంతా ఎర్ర‌గా.. క‌ళ్ల‌లో ప‌గ క‌నిపించాయి. న‌రేష్ ఎవ‌రిపై అంత ప‌గ పెంచుకున్నారో తెలియాల్సి ఉంది.'నాంది' త‌రువాత అల్ల‌రి న‌రేష్, విజ‌య్ క‌న‌క‌మేడ‌ల కాంబోలో 'ఉగ్రం' తెర‌కెక్కుతుంది.

'నాంది' సినిమాకు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. దీంతో వీరిద్ద‌రూ కొత్త క‌థ‌తో 'ఉగ్రం' ద్వారా ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచ‌నున్నారు. ఈ సినిమాలో న‌రేష్‌కు జోడిగా మ‌ల‌యాళ హీరోయిన్ మిర్నా మీన‌న్ న‌టిస్తున్నారు. ఆది సాయికుమార్ చిత్రం 'క్రేజీ ఫెలో'లో మిర్నా మీన‌న్ హీరోయిన్‌గా న‌టించారు.

'ఉగ్రం' నుంచి ఇటీవ‌ల విడుద‌లైన పోస్ట‌ర్‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌గా 'ఉగ్రం' సినిమాను చిత్రీక‌రించ‌నున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ ప‌తాకంపై నిర్మాత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లో 'ఉగ్రం' చిత్ర‌ షూటింగ్ ప్రారంభమైంది.

ఈ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌నున్నారట‌. పూర్తి స్థాయి సిరీయ‌స్ థ్రిల్ల‌ర్‌గా 'ఉగ్రం' విడుద‌ల కానుంది. అబ్బూరి ర‌వి మాట‌లు రాస్తున్నారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. న‌రేష్ న‌టించిన ‘ఇట్లు మారేడుమిల్లి నియోజ‌క‌వ‌ర్గం’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

Read More: అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా మరో వైల్డ్ యాక్షన్ డ్రామా.. 'ఉగ్రం' (Ugram First Look) ఫస్ట్ లుక్ రిలీజ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!