‘హిట్‌’ సీక్వెల్‌లో నేచురల్ స్టార్ నాని (Natural Star Nani).. ఫ్యాన్స్‌ను సర్‌‌ప్రైజ్ చేయనున్నాడా?

Updated on Jun 26, 2022 06:08 PM IST
నేచురల్ స్టార్ నాని, హిట్‌2 సినిమా పోస్టర్
నేచురల్ స్టార్ నాని, హిట్‌2 సినిమా పోస్టర్

అష్టా – చమ్మా సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టాడు నేచురల్ స్టార్ నాని (Natural Star Nani). ఆ సినిమా కమర్షియల్‌గా హిట్ కావడంతోపాటు నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వరుసగా మంచి సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు నాని. తాజాగా అంటే సుందరానికీ సినిమాతో హిట్‌ అందుకున్నాడు. కొన్నాళ్లుగా నాని నిర్మాతగా మారి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.  

ఇక, విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కిన సినిమా హిట్. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. క్రైమ్ కథాంశంలో 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హిట్’ సీక్వెల్‌లో హిట్‌2 సినిమాలో అడివి శేష్‌ హీరోగా నటిస్తున్నాడు. శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ సినిమాను నేచురల్ స్టార్ నాని, ప్రశాంతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాని ఒక చిన్న క్యారెక్టర్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అడివి శేష్‌ హీరోగా తెరకెక్కుతున్న హిట్‌2 సినిమాలోని కేమియో రోల్‌లో నాని నటిస్తాడని అంటున్నారు. క్యారెక్టర్ చిన్నదే అయినా స్పెషల్‌గా ఉంటుందని తెలుస్తోంది.

నేచురల్ స్టార్ నాని నిర్మించిన సినిమాలు

నిర్మాతగా విభిన్న కథలతో..

ఇప్పటికే నిర్మాతగా పలు విభిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తున్నాడు నాని. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అ!’,  డి ఫర్ దోపిడీ, హిట్ సినిమాలను నిర్మించాడు. ఇక, తన సోదరితో కలిసి ‘మీట్‌ క్యూట్‌’ అనే సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. నలుగురు హీరోయిన్లు ఆ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

ఇక, మేజర్‌‌ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నాడు మరో యంగ్ హీరో అడివి శేష్ . మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో శేష్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుతున్నాయి. ఈ సినిమా హిట్ ఇచ్చిన జోష్‌తో నాని (Natural Star Nani) నిర్మాతగా తెరకెక్కుతున్న హిట్‌2 సినిమాను సెట్స్‌పైకి తీసుకెళుతున్నాడు అడివి శేష్‌.

Read More : మహేష్‌బాబు(Mahesh Babu) డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్న సుకుమార్, సందీప్ రెడ్డి వంగా? ఎవరికి చాన్స్ ఇస్తాడో..

హిట్‌2 సినిమా పోస్టర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!