Major: శ‌త్రు దేశాన్ని షేక్ చేస్తున్న‌ మేజ‌ర్!..పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక‌లో అడ‌వి శేష్ టాప్‌

Updated on Jul 08, 2022 03:47 PM IST
Major: మేజ‌ర్ సినిమా పాకిస్థాన్‌లోనూ ట్రెండ్ సృష్టిస్తుంది.
Major: మేజ‌ర్ సినిమా పాకిస్థాన్‌లోనూ ట్రెండ్ సృష్టిస్తుంది.

Major: టాలీవుడ్ యంగ్ హీరో అడ‌వి శేష్ (Adivi Sesh) న‌టించిన మేజర్‌ చిత్రం ఓటీటీలో దూసుకెళుతుంది. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన మేజ‌ర్ సినిమాను ఓటీటీ ఆడియ‌న్స్ మెచ్చుకుంటున్నారు. శశి కిరణ్‌ తిక్క దర్శకత్వంలో విడుద‌లైన మేజ‌ర్ హిందీ వ‌ర్ష‌న్ ఇప్ప‌టికే నెట్‌ఫ్లిక్స్ టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుంది. మేజ‌ర్ సినిమా పాకిస్థాన్‌లోనూ ట్రెండ్ సృష్టిస్తుంది. మ‌హేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ మేజ‌ర్ సినిమాను నిర్మించింది. 

టాప్ 1లో మేజ‌ర్

మేజ‌ర్ (Major) సినిమా జూన్ 3న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇండియాతో పాటు అమెరికాలోనూ మేజ‌ర్ వ‌సూళ్ల వ‌ర్షాన్ని కురిపించింది. మేజ‌ర్ చిత్రం జూలై 3 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధ‌ర‌ను చెల్లించి సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వ‌ర్ష‌న్ టాప్ 1లో ఉంటే..తెలుగు వెర్షన్‌ రెండో స్థానంలో నిలిచింది.

ఇండియాతో పాటు శ‌త్రు దేశ‌మైన పాకిస్థాన్‌లోనూ మేజ‌ర్ (Major) రికార్డులు సృష్టిస్తుంది. పాకిస్థాన్‌లో మేజ‌ర్ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో అత్య‌ధికంగా వీక్షించారు. పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాల్లో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో అత్య‌ధికంగా వీక్షించారు. ఇండియాతో పాటు ఈ మూడు దేశాల్లో మేజ‌ర్ సినిమా టాప్ 1 ప్లేస్‌ను ఆక్ర‌మించింది. 

మేజ‌ర్ ఓ గొప్ప దేశ‌భ‌క్తి చిత్రం
అడివి శేష్ అమెరికాలో పుట్టారు. అక్క‌డే పెరిగారు. ప్ర‌ముఖ తెలుగు ర‌చ‌యిత అడివి బాపిరాజు మ‌నవడే అడివి శేష్. ఆయనపై తన తాత గారి ప్రేరణ ఎంతో ఉంది. విదేశాలలో ఉన్నప్పుడే, సినిమాల‌పై ఇష్టం పెంచుకున్న అడివి శేష్ హీరో అయ్యేందుకు ఇండియా వ‌చ్చారు. శేష్‌కు దేశ‌భ‌క్తి ఎక్క‌వ‌. అందుకే త‌న సినిమా కథలను కూడా అదే ఇతివృత్తంతో ఎంచుకొనేవారు. మేజ‌ర్ (Major) సినిమాతో శేష్ చ‌రిత్ర‌లో నిలిచిపోయే గొప్ప దేశ‌భ‌క్తి చిత్రాన్ని తీశారు. 

Read More:  'MAJOR' REVIEW (మేజర్ రివ్యూ): దేశాన్ని ప్రేమించ‌డం అంద‌రి ప‌ని, వారిని కాపాడ‌టం సోల్జ‌ర్ ప‌ని : అడివి శేష్

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!