Tollywood: ఈ వారంలో థియేటర్లు, ఓటీటీలో విడుదల కాబోయే సినిమాలివే..!

Updated on Jun 07, 2022 06:47 PM IST
టాలీవుడ్ మూవీ పోస్టర్స్ (Tollywood Movie Posters)
టాలీవుడ్ మూవీ పోస్టర్స్ (Tollywood Movie Posters)

Tollywood: కరోనా కారణంగా రిలీజ్ కాకుండా పెండింగ్‌లో ఉన్న పెద్ద సినిమాలలో ఇప్పటికే కొన్ని రిలీజ్ అయిపోయాయి. గత శుక్రవారం (జూన్ 3) అడవి శేష్ 'మేజర్', కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలు విడుదలై కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నాయి. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇక జూన్ రెండో వారంలో మరికొన్ని సినిమాలు థియేటర్, ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక నుంచి.. మీడియం రేంజ్, చిన్న సినిమాలదే హవా ఉండబోతోంది. అలాగే డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలవుతూనే ఉన్నాయి.

ఇక, ఈ వారం నాచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘777 చార్లీ’ అనే డబ్బింగ్ సినిమా.. అలాగే పలు చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.  

ఈ వారంలో మొత్తం 22 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సందడి చేయబోతుండటం విశేషం. అయితే, ఓటీటీలో కూడా థియేటర్‌కు పోటీగా అన్నట్టు సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి.. థియేటర్‌తో పాటు ఓటీటీలో కూడా ఈ వారం సినిమాల సందడి ఎక్కువే అని చెప్పవచ్చు. మరి ఈ వారం థియేటర్ ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం..!

ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు : 

  • అంటే సుందరానికి (జూన్ 10)
  • సురాపానం (జూన్ 10)
  • జరిగిన కథ (జూన్ 10)
  • చార్లీ 777 (జూన్ 10)
  • డియర్ ఫ్రెండ్ (మలయాళం-జూన్ 10)
  • జనహిత్ మే జారీ (హిందీ-జూన్​ 10)
  • జురాసిక్​ వరల్డ్​ డొమినియన్​ (హాలీవుడ్-జూన్​ 10)

ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు :

  • డాన్​ (నెట్‌ఫ్లిక్స్-జూన్​ 10)
  • కిన్నెరసాని (జీ5-జూన్​ 10)
  • సీబీఐ5: ది బ్రెయిన్​ (నెట్​‌ఫ్లిక్స్-జూన్ 12)
  • హసిల్​ (Hustle-నెట్‌ఫ్లిక్స్​-జూన్​ 8)
  • ఇన్నలే వార్​ (సోనీ లివ్​-జూన్​ 9)

ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న వెబ్ సిరీస్‌లు :

  • మిస్​ మార్వెల్​ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్-జూన్​ 8)
  • కోడ్ ఎమ్​ సీజన్​ 2 (జీ5-జూన్​ 8)
  • బేబీ ఫీవర్​ (నెట్‌ఫ్లిక్స్-జూన్​ 8)
  • ది బ్రోకెన్​ న్యూస్​ (జీ5-జూన్​ 10)
  • అర్థ్​ (జీ5-జూన్​ 10)
  • ఉడాన్​ పటోలాస్​ (అమెజాన్​ మినీ టీవీ-జూన్​ 10)
  • ఫస్ట్​ కిల్​ (నెట్‌ఫ్లిక్స్ జూన్​ 10)
  • ఇంటిమసీ (నెట్‌ఫ్లిక్స్-జూన్​ 10)
  • పీకీ బ్లైండర్స్​ (నెట్‌ఫ్లిక్స్-జూన్​ 10)
  • సైబర్​ వార్​ (ఊట్​-జూన్​ 10)

Read More: Director Tarun Bhaskar: సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుతో జత కట్టిన యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!