సుందరానికి పెళ్లైనా, కాకపోయినా, ఏమైనా సెలబ్రేషనేరా.. అంటున్న నాని (Natural Star Nani)
న్యూచురల్ స్టార్ నాని (Natural Star Nani).. ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. తర్వాత తన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు నాని. తాజాగా నాని హీరోగా, నజ్రియా హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అంటే సుందరానికీ’. ఈ సినిమా ప్రమోషన్స్‌ను వెరైటీగా అదే సమయంలో అంతే జోష్‌గా చేస్తోంది చిత్ర యూనిట్. హీరోహీరోయిన్లు నాని, నజ్రియా కూడా అంతే స్పీడ్‌తో ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.
అంటే సుందరానికీ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్, టీజర్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా నుంచి మరో పాటను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో జరిగే పెళ్లి తంతును ఈ పాటలో ఆకట్టుకునేలా చూపించాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. అదే సమయంలో నాని, నజ్రియా కూడా పెళ్లి వేడుకలో చేసే హంగామా చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఈ పాటకు మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు.
శంకర్ మహదేవన్ వాయిస్..
శంకర్ మహదేవన్, శ్వేత మోహన్ పాడిన ఈ పాటకు వివేక్ సాగర్ మంచి సంగీతాన్ని అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 10వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో జోష్ పెంచింది చిత్ర యూనిట్. తెలుగులో నజ్రియా మొదటిసారి నటిస్తుండగా.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ‘అంటే సుందరానికీ’ సినిమా విడుదల కానుంది.
ఇటీవల వైజాగ్‌లో అంటే సుందరానికీ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హీరో.. క్రిస్టియన్ అమ్మాయితో ప్రేమలో పడతాడు. రెండు కుటుంబాలు వాళ్ల ప్రేమను అంగీకరించబోవని తెలిసిన హీరోహీరోయిన్లు ఏం చేశారనేదే సినిమా కథ. వాళ్లు ఏం చేశారనే అంశాలను ట్రైలర్‌లో చాలా వినోదాత్మకంగా చూపించాడు దర్శకుడు వివేక్. ఎప్పటిలానే నాని (Natural Star Nani) డైలాగ్స్, హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.