Tharun Bhascker : తరుణ్ భాస్కర్‌కు సూపర్ ఛాన్స్.. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుతో కలిసి కథ రాశారట !

Updated on Jun 07, 2022 03:57 PM IST
సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, తరుణ్ భాస్కర్ (Singeetham Srinivasarao, Tharun Bhascker)
సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, తరుణ్ భాస్కర్ (Singeetham Srinivasarao, Tharun Bhascker)

Tharun Bhascker: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కలిసి ఓ సినిమాకి పని చేస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. అసలు ఊహించని ఇద్దరు వ్యక్తులు కలిస్తే, ఆ కాంబినేషన్ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అలాంటిదే ఇది కూడా.

లక్కీ ఛాన్స్ కొట్టేసిన తరుణ్ భాస్కర్ !

సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ఇద్దరూ కలిసి ఓ స్క్రిప్ట్ రాశారట. అలాగే ఇద్దరూ కలిసి అదే స్క్రిప్ట్‌తో ఓ సినిమా కూడా చేయబోతున్నారట. అసలు వీళ్లిద్దరూ కలిశారనే విషయమే ఆసక్తికరం. ఇక వీరిద్దరూ కలిసి పనిచేసిన సినిమా ఇంకెంత ఆసక్తికరంగా ఉంటుందో మరి? గతంలో సింగీతం శ్రీనివాసరావును కలిసి, ఓ స్క్రిప్ట్ ఐడియా పై చర్చించాడట తరుణ్ భాస్కర్. ఆ స్క్రిప్ట్ పట్ల కూడా సింగీతం ఆసక్తి చూపించారట. దీంతో, ఆ కథను వీళ్లిద్దరూ కలిసి రాశారంట. అది ఇప్పుడు సినిమాగా రూపొందనుందని సమాచారం.

ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తరుణ్ భాస్కర్ వెల్లడించారు. సింగీతం శ్రీనివాసరావు ఇప్పటికే  ప్రాజెక్ట్ K (Project K) అనే సినిమాకి వర్క్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్-ఫిక్షన్ ఫాంటసీ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

తరుణ్ భాస్కర్, సింగీతం శ్రీనివాసరావు.. ఇద్దరూ క్రియేటివ్ జీనియస్లే ! 

సింగీతం శ్రీనివాసరావు (Sinitham SrinivasRao) అంటేనే ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. అలాంటి దర్శకుడితో కలిసి రాసిన తాజా స్క్రిప్ట్ కూడా చాలా వినూత్నంగా, వైవిధ్యంగా ఉందని చెబుతున్నాడు తరుణ్ భాస్కర్. ఇందులో నటించే హీరోహీరోయిన్లు, పనిచేయబోయే టెక్నీషియన్స్ ఎవరనే విషయాల్ని త్వరలోనే వెల్లడిస్తానంటున్నాడు ఈ క్రేజీ దర్శకుడు. 

ప్రస్తుతం తరుణ్ భాస్కర్ ఓ క్రైమ్ కామెడీ సబ్జెక్టుతో సినిమా చేయబోతున్నాడు. రేపో మాపో ఇది స్టార్ట్ కాబోతోంది. మరోవైపు ‘ఓరుగల్లు’ అనే వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక వెంకటేష్‌తో తను చేయాల్సిన సినిమా కూడా, కచ్చితంగా వచ్చే ఏడాదే ఉంటుందని అంటున్నాడు తరుణ్ భాస్కర్.

ఇక ప్రస్తుతం వర్క్ చేస్తున్న సినిమాలతో పాటు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తో కలిసి, మరో కథ కూడా రాశారట సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. సింగీతం పేరు చెప్పగానే ప్రయోగాత్మక సినిమాలు గుర్తొస్తాయి. అలాంటి దర్శకుడితో కలిసి రాసిన తాజాగా స్క్రిప్ట్ కూడా చాలా కొత్తగా ఉందని చెబుతున్నారు.  వీటన్నింటితో పాటు ‘ఈ నగరానికి ఏమైంది’ పార్ట్ 2 కూడా ఉంటుందని తరుణ్ చెప్పారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనేది చూడాలి మరి!

Read More: వ‌రుస సినిమాల‌తో నాగ‌చైత‌న్య బిజీ... త‌రుణ్ భాస్క‌ర్ తో సినిమా కన్ఫర్మ్?

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!