ఆ రెండు సంవత్సరాలు చాలా సినిమాలు మిస్ అయ్యాను.. నిర్మాత ఇబ్బంది పెట్టారు : చాందిని చౌదరి (Chandini Chowdary)

Updated on Jun 24, 2022 02:48 PM IST
మాది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. తల్లిదండ్రులు ఇద్దరూ బిజినెస్ చేస్తారు. షార్ట్ ఫిల్మ్స్‌తో కొంత పాపులారిటీ వచ్చాక, కాలేజీ సమయానికి నన్ను నేను తెరపై చూసుకోవాలనే కోరిక బాగా ఎక్కువైంది.
మాది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. తల్లిదండ్రులు ఇద్దరూ బిజినెస్ చేస్తారు. షార్ట్ ఫిల్మ్స్‌తో కొంత పాపులారిటీ వచ్చాక, కాలేజీ సమయానికి నన్ను నేను తెరపై చూసుకోవాలనే కోరిక బాగా ఎక్కువైంది.

కేటుగాడు, హౌరా బ్రిడ్జి, కలర్‌‌ ఫోటో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్‌ చాందినీ చౌదరి (Chandini Chowdary). ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజై ప్రేక్షకుల హృదయాలను తాకిన సినిమా 'కలర్‌‌ ఫోటో'. ఆ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది చాందినీ. తాజాగా యువ హీరో కిరణ్‌ అబ్బవరంతో కలిసి ‘సమ్మతమే’ అనే సినిమా చేసింది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌‌ ప్రేక్షకులకు సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. 'సమ్మతమే' సినిమాలో చాందినీ చౌదరి క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్, డైలాగులు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 24వ తేదీన సమ్మతమే సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చాందిని చౌదరి (Chandini Chowdary) వ్యక్తిగత, సినిమా విశేషాలు మీకోసం. ఆమె మాటల్లోనే..

మాది వైజాగ్‌. చిన్నతనంలో త్రో బాల్ స్టేట్‌ ఛాంపియన్‌ని. హీరోలని ఇమిటేట్‌ చేయడం బాగా అలవాటు. రజినీకాంత్‌ని ఎక్కువగా ఇమిటేట్ చేసేదాన్ని. అలా నటన అలవాటైంది. చాలా షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించా. వాటి వలనే పెద్ద సినిమాల్లో నటించే చాన్స్ వచ్చింది.

చాందినీ చౌదరి

తెలుగమ్మాయిని నేనే..

మాది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. తల్లిదండ్రులు ఇద్దరూ బిజినెస్ చేస్తారు. షార్ట్ ఫిల్మ్స్‌తో కొంత పాపులారిటీ వచ్చాక, కాలేజీ సమయానికి నన్ను నేను తెరపై చూసుకోవాలనే కోరిక బాగా ఎక్కువైంది. ఒక ఫ్రెండ్‌ ద్వారా రాజ్‌తరుణ్‌ పరిచయమయ్యారు. 2011 నుంచి షార్ట్‌ ఫిల్మ్స్‌ చేయడం మొదలుపెట్టాను.

ఆ సమయంలో షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసే తెలుగు అమ్మాయిని నేను మాత్రమే. చదువు పూర్తయ్యాకే 'సినిమాలు' అని ఇంట్లో కండీషన్‌ పెట్టడంతో చదువు పూర్తి చేశాను.

చిన్నప్పటి నుంచి కథలు రాసేదాన్ని. రైటర్‌‌ అవుదామని అనుకున్నాను. డైరెక్టర్‌‌ కూడా అవ్వాలని అనుకుంటున్నాను. ఎప్పటికైనా డైరెక్షన్ చేస్తాను. ఈలోగా డైరెక్షన్‌కు సంబంధించిన మెళకువలు నేర్చుకుంటాను. హారర్ స్టోరీలు నాకు బాగా ఇష్టం.

కలర్‌‌ ఫోటో సినిమా పోస్టర్

‘కలర్‌‌ ఫోటో’ మంచి పేరు తెచ్చిపెట్టింది..

నేను నటించిన మొదటి మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ‘మను’ అనే సినిమాకు నటిగా పేరు వచ్చింది. నా మొదటి హిట్‌ మాత్రం ‘కలర్‌‌ ఫోటో’. ఆ సినిమా హిట్ తర్వాత అల్లు అర్జున్‌ గారు ఫోన్‌ చేసి అభినందించారు. ఆ సమయాన్ని ఎప్పటికీ మరచిపోలేను. 'సమ్మతమే' సినిమాను చేశాక, ఇప్పుడు ప్రేక్షకుల సమ్మతం కోసం ఎదురుచూస్తున్నాం.

నా తరువాతి సినిమా ‘గామి’ ఆగస్టులో విడుదల కానుంది. ఆ సినిమాలో విశ్వక్‌సేన్ పక్కన నటించా. కోలీవుడ్‌లో అశోక్‌ సెల్వన్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్నాను. మరో రెండు సినిమాల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మణిరత్నం డైరెక్షన్‌లో నటించాలనేది నా కల. ఆయనంటే నాకు చాలా అభిమానం. 

సమ్మతమే సినిమా పోస్టర్

నిర్మాత ఇబ్బంది పెట్టారు..

ఒక పెద్ద నిర్మాత నా డేట్స్ తీసుకుని, సుమారు మూడు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. రెండు సంవత్సరాలకి నాతో ప్రాజెక్టుకు సంతకం చేయించుకుని ఒక్క సీన్‌ కూడా షూట్‌ చేయలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ రెండు సంవత్సరాలు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, నా కెరీర్‌‌‌కి బాగా ఉపయోగపడేది. వేరే సినిమాలు చేసుకుంటానని చెప్తే బెదిరించారు. కొత్త అమ్మాయిని కావడంతో ఏమీ చేయలేకపోయాను.

ఆ రెండు సంవత్సరాలలో షార్ట్‌ ఫిల్మ్స్‌ కారణంగా మంచి పేరు వచ్చింది. ఆఫర్లు కూడా అలాగే వచ్చాయి. నిజానికి ‘ఊహలు గుసగుసలాడే’, ‘కుమారి 21 ఎఫ్’, ‘పటాస్’, ‘దృశ్యం’ సినిమాలు చేయాల్సింది. ఆ సినిమాలు చేసి ఉంటే కెరీర్‌‌ ఇంకా బాగుండేది.

ఎక్కడైనా సొంత భాష వాళ్లకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ, మన తెలుగు ఇండస్ట్రీలో ఆ అవకాశం తక్కువే. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. హీరోయిన్ అవుతానంటే ముందు మా అమ్మ ‘సినిమా ఇండస్ట్రీలో కష్టం’ అని చెప్పింది. నా అభివృద్ధి చూసి అమ్మ, నాన్న సంతోషంగా ఉన్నారు అని తన మనసులోని భావాలను పంచుకుంది చాందినీ చౌదరి (Chandini Chowdary).

Read More : తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker)‌ కొత్త సినిమా ‘కీడా కోలా’.. అదుర్స్ అనేలా ఫస్ట్‌ లుక్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!