ముఖ్యమైన వ్యక్తి గురించి సినిమా తీసినందుకు థ్యాంక్స్‌.. శర్వానంద్ (Sharwanand) ‘ఒకే ఒక జీవితం’పై అదితిరావు

Updated on Sep 12, 2022 07:01 PM IST
శర్వానంద్‌ (Sharwanand) హీరోగా, అక్కినేని అమల (Akkineni Amala) నటించిన ఒకే ఒక జీవితం సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది
శర్వానంద్‌ (Sharwanand) హీరోగా, అక్కినేని అమల (Akkineni Amala) నటించిన ఒకే ఒక జీవితం సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది

శర్వానంద్‌ (Sharwanand) హీరోగా, అక్కినేని అమల (Akkineni Amala) కీలక పాత్రలో నటించిన సినిమా ‘ఒకే ఒక జీవితం’. రితూ వర్మ హీరోయిన్‌గా నటించారు. త‌ల్లీకొడుకుల మధ్య ప్రేమానుబంధాలు, టైం ట్రావెల్ నేప‌థ్యంలో శ్రీ‌కార్తిక్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు మొదటిరోజే పాజిటివ్ టాక్ వచ్చింది.  

సరైన హిట్‌ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న శర్వానంద్‌కు ఒకే ఒక జీవితం బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌కు, తల్లీకొడుకుల సెంటిమెంట్‌ను కలుపుతూ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు శ్రీకార్తీక్. వెన్నెల కిశోర్, ప్రియదర్శిల కామెడీ అద్భుతంగా ఉంది.

శర్వానంద్‌ (Sharwanand) హీరోగా, అక్కినేని అమల (Akkineni Amala) నటించిన ఒకే ఒక జీవితం సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది

అమ్మతో కలిసి వెళ్లండి..

సినిమాలో అమ్మ సెంటిమెంట్‌కు ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులు కూడా బాగా కనెక్ట్‌ అవుతున్నారు. సినిమా ప్రీమియర్ షో చూసి అక్కినేని నాగార్జున అమ్మ గుర్తుకువచ్చారని కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక, ఒకే ఒక జీవితం సినిమాపై అదితీ రావ్‌ హైదరీ స్పందించారు.

‘నాకు కన్నీళ్లు తెప్పించి.. నా హృదయాన్ని నవ్వించినందుకు ధన్యవాదాలు. విశ్వంలోని అత్యంత ముఖ్యమైన వ్యక్తి గురించి సినిమా తీసినందుకు థాంక్యూ. అమ్మలు నిజంగానే ప్రపంచాన్ని ఉత్తమ ప్రదేశంగా మారుస్తారు. మణిహారం లాంటి ఈ సినిమాను మీ అమ్మలను తీసుకెళ్లి చూడండి’ అని ట్వీట్‌ చేశారు అదితిరావు. చాలాకాలం తర్వాత అక్కినేని అమల (Akkineni Amala) ఒకే ఒక జీవితం సినిమాలో నటించి, ఆమె నటనతో మెప్పించారు. శర్వానంద్‌ (Sharwanand), సిద్దార్ధ్‌ హీరోలుగా నటించిన మహాసముద్రం సినిమాలో అదితిరావు హైదరీ ఒక హీరోయిన్‌గా నటించారు.

Read More : Oke Oka Jeevitham Review:శర్వానంద్ (Sharwanand) ‘ఒకే ఒక జీవితం’..జీవితసత్యాలను అందంగా తెలిపే విభిన్న ప్రయత్నం!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!