తాత ఎన్టీఆర్‌‌ చేసినట్టు స్ఫూర్తినిచ్చే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాను : హీరో కల్యాణ్‌రామ్ (Kalyan Ram)

Updated on Jul 27, 2022 06:15 PM IST
‘అప్‌ క్లోజ్‌ విత్‌ ఎన్‌కేఆర్‌‌’  పేరుతో కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) ప్రత్యేక వీడియోలను రూపొందించి విడుదల చేస్తున్నారు.
‘అప్‌ క్లోజ్‌ విత్‌ ఎన్‌కేఆర్‌‌’ పేరుతో కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) ప్రత్యేక వీడియోలను రూపొందించి విడుదల చేస్తున్నారు.

తన బాబాయ్‌, నందమూరి బాలకృష్ణ ప్రభావం తనపై ఎంతగానో ఉంటుందన్నారు హీరో కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram). కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్‌ సినిమా ‘బింబిసార’. ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘అప్‌ క్లోజ్‌ విత్‌ ఎన్‌కేఆర్‌‌’ పేరుతో కల్యాణ్‌ రామ్‌ ప్రత్యేక వీడియోలను రూపొందించి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఎపిసోడ్‌ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో ఎపిసోడ్‌ను రిలీజ్ చేశారు కల్యాణ్‌రామ్.  

‘సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడంతో దాని ప్రభావం నాపై ఉంది. తాత (ఎన్టీఆర్‌)తో మొదలైన ఈ నట ప్రస్థానాన్ని బాబాయ్‌ (బాలకృష్ణ) కొనసాగిస్తున్నారు. నాన్న (హరికృష్ణ) కొన్ని చిత్రాల్లో నటించారు. తమ్ముడు (జూనియర్ ఎన్టీఆర్) కూడా నటుడయ్యారు. అందరి సినిమాలూ చూసేవాడిని. బాబాయ్‌ సినిమాలకు ఎక్కువగా ప్రభావితమయ్యాను‘.

బింబిసార సినిమాలో హీరో కల్యాణ్‌రామ్ (Kalyan Ram)

అలాంటి సినిమాలు చేయాలని..

‘ప్రేక్షకుల్లో తాతకు ఉన్న ఆదరణ చూసి, నేను కూడా స్ఫూర్తినిచ్చే సినిమాలు చేయాలని బలంగా ఫిక్స్‌ అయ్యా. పౌరాణికం, జానపదం, సోషియో ఫాంటసీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. హాలీవుడ్‌ సినిమాలు ‘స్పైడర్‌ మ్యాన్‌’, ‘అవెంజర్స్‌’ చూసినప్పుడు ఇలాంటివి ‘మనమూ చేస్తే బాగుంటుంది కదా’ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగింది. దాంతో మనం అద్భుతాలు చేయచ్చు. ‘పాతాళ భైరవి’, ‘జగదేకవీరుని కథ’, ‘భైరవద్వీపం’, ‘ఆదిత్య 369’, ‘యమదొంగ’, ‘బాహుబలి’ చిత్రాల గురించి నేనెప్పుడూ చర్చిస్తుంటాను.

2019లో ‘మహా నాయకుడు’ సినిమా షూటింగ్‌లో ఉన్న సమయంలో ‘మీకు ఓ కథ చెప్పాలి. కుదురుతుందా’ అని దర్శకుడు వశిష్ఠ నుంచి నాకు మెసేజ్‌ వచ్చింది. ‘పటాస్‌’ సినిమా సమయం నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. ‘మహా నాయకుడు’ షూటింగ్‌ పూర్తవగానే వశిష్ఠ.. ‘బింబిసార’ కథ చెప్పారు. ఈ సినిమా ఎలా తెరకెక్కింది? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ కోసం వేచి చూడాల్సిందే’ అని తెలిపారు కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram).

Read More : నటనలో అక్షరాభ్యాసం చేసింది బాలకృష్ణ బాబాయ్‌ : వీడియో రిలీజ్ చేసిన కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!