నటనలో అక్షరాభ్యాసం చేసింది బాలకృష్ణ బాబాయ్‌ : వీడియో రిలీజ్ చేసిన కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram)

Updated on Jul 26, 2022 04:23 PM IST
కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్‌‌లో బాలకృష్ణ, పక్కన హరికృష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్ (Kalyan Ram)
కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్‌‌లో బాలకృష్ణ, పక్కన హరికృష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్ (Kalyan Ram)

నందమూరి కుటుంబం నుంచి వచ్చి, ప్రేక్షకుల్ని అలరించిన కథానాయకులలో కల్యాణ్‌ రామ్‌ (KalyanRam) కూడా ఒకరు. విభిన్న కథలను అందించడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈ జాబితాలో ‘బింబిసార కూడా’ చేరుతుంది.

కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నటుడిగా తన ప్రస్థానాన్ని కల్యాణ్‌ రామ్‌ గుర్తు చేస్తున్నారు. ‘అప్‌ క్లోజ్‌ విత్‌ ఎన్‌కేఆర్‌’ పేరుతో ఒక వీడియోను షేర్ చేశారు.

‘నాకిప్పటికీ గుర్తుంది. అది 1989వ సంవత్సరం. ‘అన్నయ్యా.. కల్యాణ్‌ని సినిమాల్లో పరిచయం చేస్తా’ అని బాబాయ్‌ (బాలకృష్ణ) నాన్న(హరికృష్ణ) ను అడిగారు. అప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నా. చదువుపై శ్రద్ధ పెట్టకుండా పూర్తిగా సినిమాలవైపే మొగ్గు చూపుతానేమోనని నాన్న సందేహిస్తుంటే.. ‘నేను చూసుకుంటా. మీరు ఎక్కువగా ఆలోచించద్దు’ అని బాబాయ్‌ అన్నారు.

నందమూరి బాలకృష్ణ, కల్యాణ్‌ రామ్ (Kalyan Ram)

నటనలో అక్షరాభ్యాసం చేయించారు..

‘బాబాయ్ దగ్గరుండి నాతో నటనలో అక్షరాభ్యాసం చేయించారు. బాల నటుడిగా నేను చేసిన మొదటి సినిమా ‘బాల గోపాలుడు’. అప్పటివరకూ ఎప్పుడూ ‘కెమెరా’ ముందుకు రాలేదు. దర్శకుడు కాశీ విశ్వనాథ్‌ తెరకెక్కించిన ‘తొలి చూపులోనే’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాను. ఆ తర్వాత నా సినీ ప్రయాణం గురించి మీ అందరికీ తెలిసిందే. నా ఫస్ట్ రెండు సినిమాలు ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. ఆ సమయంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. అప్పుడే నన్ను నేను నిరూపించుకోవాలనే కసి పెరిగింది’ అని కల్యాణ్‌ రామ్ (KalyanRam) చెప్పారు.

సాంకేతికత కూడా పెరిగింది..

‘ఆ సమయంలో వచ్చిందే ‘అతనొక్కడే’ సినిమా. ఈ  సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. అనంతరం, సినీ రంగంలోనూ సాంకేతికత వినియోగం బాగా పెరిగింది. హాలీవుడ్‌లో వచ్చే త్రీడీ సినిమాల స్ఫూర్తితో కొత్తగా ఏదైనా చేయాలని అనిపించింది. మేం అనుకున్నట్టుగానే ‘ఓం: త్రీడీ’ సినిమాను టాలీవుడ్‌కు పరిచయం చేశా. ఈ సినిమా కూడా నిరాశ పరిచింది.

ఆ తర్వాత కూడా, సినిమా మేకింగ్‌లో చాలా మార్పులొచ్చాయి. తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. ‘బాహుబలి’ పాన్‌ వరల్డ్‌ సినిమాగా మారింది. కొవిడ్‌ రావడంతో అంతా ప్రశ్నార్థకమైంది. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా, లేదా? అనే సందేహం కలిగింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అవన్నీ తొలగిపోయాయి. ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ అద్భుతంగా నటించారు’ అని కల్యాణ్‌ రామ్ (KalyanRam) తన మనసులో మాటను పంచుకున్నారు. ఈ విశేషాలకు సంబంధించిన మరో ఎపిసోడ్‌ను త్వరలోనే ఆయన విడుదల చేయనున్నారు.

 Read More : ధనుష్‌ (Dhanush) హీరోగా తెరకెక్కుతున్న ‘సార్’ సినిమా నుంచి రెండు అప్‌డేట్స్‌.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!