టర్కీలో హోటల్‌లో బాలకృష్ణ (BalaKrishna).. సామాన్యుడితో సరదాగా ముచ్చటించిన బాలయ్య

Updated on Sep 01, 2022 05:54 PM IST
నందమూరి బాలకృష్ణ (BalaKrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్‌బీకే107 షూటింగ్‌ టర్కీలో జరుగుతోంది
నందమూరి బాలకృష్ణ (BalaKrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్‌బీకే107 షూటింగ్‌ టర్కీలో జరుగుతోంది

నటసింహ నందమూరి బాలకృష్ణ (BalaKrishna) ఎక్కడైనా ఒకేలా ఉంటారు. కొందరు ఆయనకు కోపం ఎక్కువ అంటుంటారు. ఆయనను దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం మనసు వెన్న అని చెబుతూ ఉంటారు. బాలయ్యలోని ఆ గుణాన్ని బేస్ చేసుకొనే బోయపాటి ఆయనతో సినిమాలు చేస్తుంటారు. బాలకృష్ణతో పని చేసిన ఏ దర్శకుడు అయినా ఆయనకి బాగా క్లోజ్ అయిపోతుంటారు.

దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు, బాలకృష్ణకు మధ్య క్లోజ్ నెస్ పెరగడానికి కారణం కూడా ఆయన నిజాయితీనే అని చెబుతుంటారు. ఒక సెలబ్రిటీతో ఎలా ఉంటారో, సామన్యుడితో కూడా బాలయ్య అలాగే బిహేవ్ చేస్తారని తాజాగా బైటికొచ్చిన వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

నందమూరి బాలకృష్ణ (BalaKrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్‌బీకే107 షూటింగ్‌ టర్కీలో జరుగుతోంది

హే భాయ్ అంటూ..

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్‌బీకే107 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. ఈ సందర్భంగా బాలయ్య టర్కీలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఓ కుటుంబంతో కలిసి టిఫిన్ చేశారు. వారితో సరదాగా కబుర్లు చెప్పారు. ‘హే భాయ్.. టిఫిన్ చేసేశా.. ఇక మందులు వేసుకొనే సమయం అయ్యింది. ఓ వైపు హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఇలా అన్ని పనులు చేయడం వల్ల ఆనందంగా ఉంది. ఏ పనీ లేకుండా ఖాళీగా కూర్చునే వాళ్లకి పిచ్చి ఆలోచనలు వస్తాయంటారు’ అని అన్నారు బాలయ్య.

అనంతరం ఒక మహిళను చూపించి, వీళ్లు ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూస్తుంటారు. మైండ్ పాడు చేసుకుంటారు. నా ఉద్దేశం ప్రకారం టీవీ  చూడకపోతే మెదడుకు మంచిది’ అంటూ సరదాగా సంభాషించారు. బాలయ్య మాటలతో ఆ కుటుంబం మొత్తం నవ్వుకున్నారు. బాలకృష్ణ (BalaKrishna) సింప్లిసిటీకి అభిమానులు ముచ్చట పడుతున్నారు.  జై బాలయ్య అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

Read More : నందమూరి బాలకృష్ణ (BalaKrishna), క్రిష్ జాగర్లమూడి, గుణశేఖర్‌‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!