బాలకృష్ణ (BalaKrishna) హీరోగా తెరకెక్కుతున్న ఎన్‌బీకే 107 సినిమా షూటింగ్‌ టర్కీలో

Updated on Aug 31, 2022 12:20 PM IST
అఖండ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ తర్వాత బాలకృష్ణ (BalaKrishna) గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు
అఖండ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ తర్వాత బాలకృష్ణ (BalaKrishna) గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు

అఖండ సినిమా ఘన విజయంతో నందమూరి బాలకృష్ణ (BalaKrishna) మంచి జోష్‌ మీద ఉన్నారు. అదే జోష్‌తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఎన్‌బీకే107 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన బాలకృష్ణ ఫస్ట్‌ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

బాలకృష్ణ సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతోందా అనే వార్తల కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మాస్‌ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఎన్‌బీకే 107 సినిమా షూటింగ్‌ మరో షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది.

అఖండ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ తర్వాత బాలకృష్ణ (BalaKrishna) గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు

ప్రధాన తారాగణంతో..

ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో కేవలం ప్రధాన పాత్రధారులు మాత్రమే పాల్గొంటున్నారని సమాచారం. ఇప్పుడు జరుగుతున్న చిత్రికరణతో సినిమా టాకీ పార్ట్‌ సహా యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను తెరకెక్కిస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఎన్‌బీకే 107 ఫస్ట్‌ హంట్‌ వీడియోకు మంచి స్పందన లభించింది. కాగా, బాలకృష్ణ (BalaKrishna) హీరోగా తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌లో వరలక్ష్మీ శరత్‌ కుమార్, దునియా విజయ్, చంద్రికా రవి తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అఖండ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన ఎస్‌ఎస్‌ తమన్ ఎన్‌బీకే 107 సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. 

Read More : నందమూరి బాలకృష్ణ (BalaKrishna), క్రిష్ జాగర్లమూడి, గుణశేఖర్‌‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!