న‌య‌న‌తార (Nayanthara) తో క‌లిసి కుల‌దైవం స‌న్నిధిలో మొక్కులు తీర్చుకున్న విఘ్నేష్ శివ‌న్ (Vignesh Shivan) 

Updated on May 31, 2022 04:11 PM IST
త‌మిళ‌నాడులోని మహాబలిపురంలో విఘ్నేష్‌, న‌య‌న‌తార  (Nayanthara) పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఓ వైపు పెళ్లి ప‌నులు, మ‌రోవైపు ఆల‌య ద‌ర్శ‌నాల‌తో విక్కీ, న‌య‌న్ ఫుల్ బిజీగా ఉన్నారు. 
త‌మిళ‌నాడులోని మహాబలిపురంలో విఘ్నేష్‌, న‌య‌న‌తార (Nayanthara) పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఓ వైపు పెళ్లి ప‌నులు, మ‌రోవైపు ఆల‌య ద‌ర్శ‌నాల‌తో విక్కీ, న‌య‌న్ ఫుల్ బిజీగా ఉన్నారు. 

సౌత్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార (Nayanthara) త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు. ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌, న‌య‌న‌తార ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. జూన్ 9న న‌య‌న్, విక్కీలు పెళ్లి చేసుకోనున్నారు. త‌మిళ‌నాడులోని మహాబలిపురంలో వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఓ వైపు పెళ్లి ప‌నులు, మ‌రోవైపు ఆల‌య ద‌ర్శ‌నాల‌తో విక్కీ, న‌య‌న్ ఫుల్ బిజీగా ఉన్నారు. 

న‌య‌న‌తార (Nayanthara) తో క‌లిసి విఘ్నేష్ శివ‌న్ సోమ‌వారం తిరుచ్చిలోని శ్రీరంగనాథుని ఆల‌యానికి వెళ్లారు. శ్రీరాంగ‌నాథుని ద‌ర్శ‌నం అనంత‌రం విఘ్నేష్ శివ‌న్ కుల దైవం కంచి కామాక్షి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు.  తంజావూరు జిల్లా అయ్యంపేట సమీపంలోని పళత్తూర్ గ్రామంలో విఘ్నేష్‌ శివన్‌ కులదైవం.. కంచి కామాక్షి అమ్మవారి ఆల‌యం ఉంది. అక్క‌డ అమ్మ‌వారి గుడిలో పాలు పొంగించారు. 

న‌య‌న్, విక్కీ దైవ ద‌ర్శ‌నాల‌కు వెళుతున్నారు. తిరుప‌తిలో శ్రీవారిని మొద‌ట ద‌ర్శించుకున్నారు. ఆ త‌ర్వాత షిరిడీలోని బాబా ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ప్ర‌స్తుతం శ్రీరంగంలోని రంగ‌నాథుడి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజులు నిర్వ‌హించారు. పెళ్లి ఘ‌డియ‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో కుల‌దైవం ద‌గ్గ‌ర మొక్కులు తీర్చుకున్నారు. మొద‌ట తిరుప‌తిలో న‌య‌న్, విఘ్నేష్‌ల పెళ్లి ఉంటుంద‌నే వార్త‌లు వినిపించాయి. కానీ రీసెంట్‌గా వీరి పెళ్లి ప‌త్రిక సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. ఆ డిజిట‌న్ ఆహ్వాన ప‌త్రిక‌లో వీరి పెళ్లి త‌మిళ‌నాడులోని మ‌హాబ‌లిపురంలో జూన్ 9న జ‌ర‌గ‌నున్న‌ట్లు ఉంది. 

ఓ వైపు పెళ్లి ప‌నులు, మ‌రోవైపు ఆల‌య ద‌ర్శ‌నాల‌తో విక్కీ, న‌య‌న్  (Nayanthara) ఫుల్ బిజీగా ఉన్నారు. 

కోలీవుడ్‌లో నటి నయనతార, దర్శకుడు వఘ్నేష్‌ శివన్ ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని వీరి ప్రేమను పెళ్లి బంధంగా మార్చ‌నున్నారు.  విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహ వేడుకను జ‌రిపించిన‌ వెడ్డింగ్ ప్లానరే న‌య‌న్, విక్కీల పెళ్లి వేడుక‌ల బాధ్య‌త‌ను తీసుకోనున్నారు. నయనతార ప్రభుదేవాకు దూరమయ్యాక విఘ్నేష్‌తో ప్రేమ‌లో ప‌డింది. 2015లో నానుమ్ రౌడీ దాన్ సినిమాతో విఘ్నేష్, (Vignesh Shivan)  న‌య‌న్ (Nayanthara) ప్రేమ‌లో ప‌డ్డారు. ఇరు కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, సినీ ప్ర‌ముఖుల మ‌ధ్య వీరి వివాహం త‌మిళ‌నాడులోని మ‌హాబ‌లిపురంలో జూన్ 9న జ‌ర‌గ‌నుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!