బాల‌కృష్ణతో (Balakrishna) మూవీ మాములుగా ఉండ‌దు : అనిల్ రావిపూడి

Updated on Jun 12, 2022 11:44 AM IST
 బాల‌కృష్ణ  (Balakrishna) 108 వ సినిమా త‌న ద‌ర్శ‌క‌త్వంలోనే అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
బాల‌కృష్ణ (Balakrishna) 108 వ సినిమా త‌న ద‌ర్శ‌క‌త్వంలోనే అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.

Balakrishna: బాల‌కృష్ణ హీరోగా,  ఓ వెరైటీ క‌థ‌తో సినిమా ప్లాన్ చేశానని ఎఫ్ 3 డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ ప్రకటనలో  తెలిపారు. బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నట సింహం 108 వ సినిమా త‌న ద‌ర్శ‌క‌త్వంలోనే ఉంటుందంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. బాలయ్య బాబు సినిమాకు కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాలో ఉంటాయని.. ఇప్పటి వరకు బాల‌కృష్ణ టచ్ చేయని వెరైటీ సబ్జెక్టుతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని తెలిపారు.

బాల‌కృష్ణ‌ తో కొత్త ప్రయోగం

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఎఫ్‌ 2 సినిమాతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత ఎఫ్ 2 కు సీక్వెల్‌గా ఎఫ్ 3 తీశారు. ఎఫ్ 3 కూడా సూప‌ర్ హిట్ కొట్టింది. అలాగే గతంలో అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషనులో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' కూడా మంచి హిట్ చిత్రంగానే నిలిచింది.  ఈ క్రమంలో బాలయ్య బాబుతో కూడా ఒక వెరైటీ చిత్రం ప్లాన్ చేశారు అనిల్ రావిపూడి (Anil Ravipudi). 

బాల‌కృష్ణ  (Balakrishna) 108 వ సినిమా త‌న ద‌ర్శ‌క‌త్వంలోనే అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.

బాల‌కృష్ణ తో సినిమా అన్నది చిరకాల కోరిక 

అనిల్ రావిపూడికి బాలయ్య బాబుతో సినిమా చేయాలన్నది చిరాకాల కోరిక. ఇప్పుడు ఆ కోరిక నెర‌వేరుతుంద‌ని అనిల్ తెలిపారు. త‌న ట్విట్ట‌ర్‌ ద్వారా ఎన్‌బీకే 108 సినిమా వివ‌రాలు త్వ‌ర‌లో రిలీజ్ చేస్తానంటూ పోస్ట్ పెట్టారు. అయితే ఇంత‌కు ముందు సినిమాల్లా ఇది ఉండదని, కంటెంట్ అదిరిపోయే రేంజ్‌లో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక అనిల్ రావిపూడి బాల‌కృష్ణ‌తో యాక్ష‌న్ సినిమా చేస్తారా? లేదా కామెడీ సినిమా చేస్తారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

 
 
గాడ్ ఆఫ్ మాసెస్, రోరింగ్ లయన్ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. బాల‌కృష్ణ‌ 108వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బాల‌కృష్ణ‌ సినిమా బ్యాంగ్ మామూలుగా ఉండదు. మరిన్ని వివరాలు త్వరలో రిలీజ్ చేస్తా.
అనిల్ రావిపూడి 
 

అనిల్ రావిపూడి ట్వీట్ చూసిన బాలకృష్ణ (Balakrishna) అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరి కాంబోలో ఓ ఖతర్నాక్ క‌థ‌తో సినిమా వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు. బాల‌కృష్ణ 107 సినిమా టీజ‌ర్ ఇప్ప‌టికే యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది. మిలియ‌న్ల వ్యూస్‌తో ముందుకు సాగిపోతోంది. ఇక అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా  ఎన్‌బీకే 108 సినిమా అప్‌డేట్స్‌తో.. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కి సమాచారం అందివ్వడం గమనార్హం

Read More: లెజండ‌రీ హీరో బాల‌కృష్ణ (Balakrishna) బ‌ర్త్ డే స్పెషల్ స్టోరి - సినీ, రాజ‌కీయ జీవిత విశేషాలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!