Nandamuri Balakrishna: NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్.. 'సింహం వేటకు సిద్ధం'.. అభిమానులకు కిక్కిచ్చే అప్‌డేట్!

Updated on Jun 07, 2022 06:08 PM IST
NBK107 మూవీ పోస్టర్ (NBK107 Movie Poster)
NBK107 మూవీ పోస్టర్ (NBK107 Movie Poster)

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గతేడాది చివర్లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ‘అఖండ’ (Akhanda) మూవీ సూపర్ సక్సెస్‌ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య బాబు.. అదే ఉత్సాహంతో తన తదుపరి సినిమా షూటింగ్స్ చకచకా ఫినిష్ చేస్తున్నారు. 

‘క్రాక్’ (KRACK) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత గోపిచంద్, బాల‌య్య‌తో సినిమా చేయ‌డంతో ప్రేక్ష‌కుల‌లో భారీ స్థాయిలో అంచ‌నాలు నెల‌కొన్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను చాలా రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఈ సినిమాలో బాలయ్య లుక్ ని సైతం రివీల్ చేశారు. మాస్ లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నారు బాలయ్య. 

ఈ సినిమాలో తమిళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి కొంతమంది నటులను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి తారలు ఉన్నారు. ఇందులో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ (Shruti Hassan) కనిపించనుంది. అలానే సెకండ్ హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ హానీ రోజ్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఖతర్నాక్ న్యూస్ బయటపెట్టారు మేకర్స్. 'సింహం వేటకు సిద్ధం..' అని పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ వారు,  NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్ అంటూ నందమూరి అభిమానులకు కిక్కిచ్చే అప్‌డేట్ ఇచ్చారు. అయితే టాలీవుడ్ (Tollywood) వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం జూన్ 10న బాల‌య్య పుట్టిన రోజు సంద‌ర్భంగా పోస్ట‌ర్‌గాని వీడియో గాని విడుద‌ల చేయ‌నున్నారట‌. దీనిపై రెండ్రోజుల్లో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. మైత్రీ మూవీస్ సంస్థ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్నట్లు సమాచారం.

అయితే, చాలా రోజులుగా ఈ సినిమాకు 'జై బాలయ్య' (Jai Balayya) అనే టైటిల్ పెడతారని వార్తలొస్తున్నాయి. కానీ ఇప్పుడు మరో టైటిల్ వినిపిస్తోంది.  'అన్నగారు', 'వీర సింహారెడ్డి' వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లోకి 'రెడ్డిగారు' కూడా వచ్చింది చేరింది. 'రెడ్డిగారు' అనే టైటిల్ ను దాదాపు ఖాయం చేసినట్లుగా సమాచారం. ఇదే టైటిల్ ను బాలయ్య బర్త్ డే రోజు అనౌన్స్ చేస్తారట. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు.

Read More: Indian Idol Telugu: తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ షో కు చీఫ్ గెస్ట్ గా నంద‌మూరి బాలకృష్ణ!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!