Sardar Movie: కార్తీ 'సర్దార్' మూవీ తెలుగు హక్కులను దక్కించుకున్న అన్నపూర్ణ స్టూడియోస్..!

Updated on Jun 28, 2022 07:09 PM IST
'సర్దార్' మూవీ పోస్టర్ (Sardar Movie Poster)
'సర్దార్' మూవీ పోస్టర్ (Sardar Movie Poster)

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Hero Karthi) ఇటీవల 'సుల్తాన్' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత కార్తీ, ‘అభిమన్యుడు’ ఫేమ్ పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్‌లో.. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’ . 

‘సర్దార్’ సినిమాలో రాశి ఖన్నా (Raashi Khanna) హీరోయిన్ గా నటిస్తుండగా.. రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో కనిపించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జివి ప్రకాష్ కుమార్ సంగీత సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. సర్దార్ 2022 దీపావళికి తెలుగు, తమిళంలో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. 

‘సర్దార్‌’‌ (Sardar) చిత్రంపై తమిళంతో పాటు తెలుగులోనూ భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకే ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసేందుకు భారీ పోటీని ఎదుర్కొని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగు పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న విషయాన్ని సోమవారం (జూన్‌ 27) ప్రకటించారు. కాగా, నాగార్జున–కార్తీ కాంబినేషన్‌లో వచ్చిన‘ఊపిరి’ సినిమాలో ఈ ఇద్దరూ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం నటులుగా కాదు.. వీరి కాంబినేషన్‌ రిపీట్‌ కానున్నది నిర్మాత, హీరోగా. 

సర్ధార్ మూవీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా ఇందులో కార్తీ ద్విపాత్రిభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్, (Sardar First Look) టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచింది. మరి దీపావళికి రానున్న సర్ధార్ ఎంతర మేర సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న గ్రాండియర్ మూవీ పొన్నియన్ సెల్వన్ లో ఒక ముఖ్య పాత్ర చేస్తున్న కార్తీ.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!