My Dear Bootham: కొత్త అవతారంలో ప్రభుదేవా.. 'మై డియర్ భూతం' ఫస్ట్ లుక్ పోస్టర్!

Updated on Jun 19, 2022 01:40 PM IST
మై డియర్ భూతం పోస్టర్స్ (My Dear Bhootam Posters)
మై డియర్ భూతం పోస్టర్స్ (My Dear Bhootam Posters)

సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా పలు సినిమాలకు పని చేసి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు ప్రభుదేవా (Prabhudeva). ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది సల్మాన్ ఖాన్ తో ప్రభుదేవా చేసిన మూవీ `రాధే` ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.

దీంతో ఇప్పటివరకు మరే సినిమాకూ దర్శకత్వం వహించని ప్రభుదేవా నటుడిగా మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుదేవా తాజాగా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మై డియర్ భూతం'.

కాగా, ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. ఇక, ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ వారు విడుదల చేస్తుండగా.. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ పై బాలాజీ ప్రొడ్యూస్ చేశారు. ఎన్.రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సురేశ్ మీనన్, రమ్య నంబీసన్, బిగ్ బాస్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, లొల్లు సభా, స్వామినాథన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

డి.ఇమ్మాన్ మ్యూజిక్ అందించగా, సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్. ఫాంటసీ చిత్రంగా వస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా (Prabhudeva) మెజీషియన్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది.  

ప్రభుదేవా లుక్ కు సంబంధించిన పోస్టర్ ని (First Look Poster) చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. అందులో జీనీ తరహాలో విచిత్రమైన డ్రెస్ లో ప్రభుదేవా కనిపిస్తున్న తీరు విశేషంగా ఆకట్టుకుంటోంది. పక్కనే స్కూల్ డ్రెస్ లో ఓ పిల్లవాడు కనిపిస్తుండగా ప్రభుదేవా చేతిలో ఉన్న ఆయుధం మంత్రదండంలా కనిపిస్తోంది.

ఫాంటసీ అంశాల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా పిల్లలని ఎంటర్ టైన్ చేయాలనే లక్ష్యంతో ఈ మూవీని రూపొందించినట్టుగా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ పాత్రలోకి తను పరకాయ ప్రవేశం చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ మేకోవర్ కోసం ప్రభుదేవా చాలా శ్రమించినట్టుగా స్పష్టమవుతోంది. కాగా, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీనీ ప్రకటిస్తామని చిత్రబృందం పేర్కొంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!