యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తాజా మూవీ 'రుద్రుడు' (Rudrudu).. అదిరిపోయిన గ్లింప్స్!

Updated on Oct 30, 2022 11:37 AM IST
'కాంచన-3' తర్వాత మూడేళ్ళు గ్యాప్‌ తీసుకుని 'రుద్రుడు' (Rudrudu) సినిమాతో లారెన్స్‌ ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
'కాంచన-3' తర్వాత మూడేళ్ళు గ్యాప్‌ తీసుకుని 'రుద్రుడు' (Rudrudu) సినిమాతో లారెన్స్‌ ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ఓ వైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరో వైపు హీరోగా ఫుల్‌ బిజీగా ఉన్నాడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో లారెన్స్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య 'కాంచన', 'గంగ' వంటి సినిమాలు ఆయనకి కాసుల వర్షం కురిపించాయి. ఆ తరువాత చేసిన 'శివలింగ' కూడా ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన మార్కు సినిమాలు రాలేదనే చెప్పాలి.

ఈ నేపథ్యంలోనే 'కాంచన-3' తర్వాత మూడేళ్ళు గ్యాప్‌ తీసుకుని 'రుద్రుడు' (Rudrudu) సినిమాతో లారెన్స్‌ ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కధిరేశన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్‌ చేశాయి.

తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కథిరేసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి, లారెన్స్ బర్త్ డేను పురస్కరించుకుని తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ గ్లింప్స్‌ను (Rudrudu Glimpse) రిలీజ్‌ చేసింది. ఇందులో లారెన్స్ యాంగ్రీ స్టైల్, లుక్స్ బాగున్నాయి. ఫోటోగ్రఫీతో పాటు జివి ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. 

మొత్తంగా 'ఈవిల్ ఈజ్ నాట్ బార్న్ ఇట్స్ క్రియేటెడ్' అనే కాన్సెప్ట్ తో పవర్ఫుల్ గా రూపొందిన 'రుద్రుడు' గ్లింప్స్ (Rudrudu Glimpse) ప్రేక్షకులలో సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను మరింతగా పెంచిందనే చెప్పాలి. కొందరు రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తుండడం, వారిని తన కత్తితో లారెన్స్ రౌద్రంతో అంతమొందించడం వంటి యాక్షన్ సన్నివేశాలతో 'రుద్రుడు' గ్లింప్స్ టీజర్ రూపొందింది.

లారెన్స్ జోడీగా ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) నటిస్తున్న 'రుద్రుడు' (Rudrudu) సినిమాలో, శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Read More: Chandramukhi 2: కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ హీరోగా 'చంద్రముఖి 2'.. అధికారిక ప్రకటన వచ్చేసింది!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!