కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా షూటింగ్!

Updated on Jul 24, 2022 04:17 PM IST
ఎన్‌బీకే 107 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)
ఎన్‌బీకే 107 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)

నందమూరి నటసింహం నందమూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna), స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేషన్‌లో వ‌స్తున్న క్రేజీ ప్రాజెక్టు ఎన్‌బీకే 107. ఇప్పటికే విడుద‌లైన ఫ‌స్ట్ హంట్ టీజ‌ర్.. గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్‌ బాల‌కృష్ణ అభిమానుల‌కు పూనకాలు తెప్పించింది. వాళ్లకు కావాల్సినంత వినోదాన్ని అందించే సినిమాగా ఉండ‌బోతోంద‌ని తెలిసేలా చేసింది. ఈ సినిమా షూటింగ్ క‌ర్నూల్‌లో జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాపై తాజా అప్‌డేట్ ఒకటి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కీలక సన్నివేశాల్లో..

ప్రస్తుతం క‌ర్నూల్‌లోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంట‌ర్ వ‌ద్ద సినిమాలో వ‌చ్చే కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ని టాక్. సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచే ఈ సన్నివేశాల్లో కీలక నటీనటులు పాల్గొననున్నట్టు తెలుస్తోంది. క‌న్నడ యాక్టర్ ధునియా విజ‌య్ ఎన్‌బీకే 107 సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నారు. వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్ కీ రోల్ చేస్తున్నారు.

కర్నూలు కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్‌‌ ఫోటోలు, బాలకృష్ణ

త్వరలో రిలీజ్ డేట్..

మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్‌ఎస్‌ థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా విడుద‌ల ఎప్పుడ‌నేది త్వరలోనే ప్రక‌టించనున్నారు మేక‌ర్స్.

రాయ‌లసీమ నేప‌థ్యంలో జ‌రిగిన‌ నిజ సంఘ‌ట‌న‌ల‌ ఆధారంగా ప‌వ‌ర్ ఫుల్ మాస్ ఎంట‌ర్‌‌టైన‌ర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోందని సినీ వర్గాల టాక్‌. మొత్తానికి బాలయ్య (Nandamuri Balakrishna) మరోసారి ఫ్యాక్షన్‌ సినిమాతో అభిమానులను అలరించనున్నరన్నమాట.

Read More : వయసు 62 .. ఇండస్ట్రీ @ 50 .. అన్‌స్టాపబుల్‌ : నేడు నందమూరి బాలకృష్ణ (BalaKrishna) పుట్టినరోజు !

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!