"కొంతమంది నేను ఇండస్ట్రీలో ఉండకూడదని కోరుకున్నారు".. హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) సంచలన వ్యాఖ్యలు..!
ఇటీవలే 'సీతారామం' (Sitaramam) సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman). 'మహానటి' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఈ మలయాళ హీరో. ఇందులో అలనాటి నటుడు జెమినీ గణేషన్ పాత్రలో జీవించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు దుల్కర్. ఇక, ఈ సినిమాలో కీర్తిసురేష్, దుల్కర్ సల్మాన్‌ల నటనకు సినీ విమర్శకులు సైతం ముగ్దులయ్యారు.
ఇక ఈ హీరో ఇటీవలే నటించిన 'సీతారామం' (Sitaramam) చిన్న సినిమాగా విడుదలయి, తెలుగులోనూ కూడా భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. హీరో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించి మెప్పించాడు. అంతే కాకుండా , ఈ చిత్రం ఓవర్సీస్‌లోనూ బాగానే వసూళ్లను రాబట్టింది. సౌత్ ఇండస్ట్రీలో దుల్కర్ సల్మాన్‌కు ఒక ప్రత్యేక ఇమేజ్‌ను తీసుకొచ్చింది ఈ ప్రేమకథా చిత్రం.
ఇక, ఈ సినిమాలో లెఫ్టినెంట్ రామ్, సీత పాత్రలను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో దర్శకుడు హను రాఘవపూడి (Director Hanu Raghavapudi) విజయం సాధించాడు. ఇక దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన చిత్రం 'చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్'. ఈ సినిమా ఆర్.బల్కీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. నెగిటివ్ రివ్యూస్, చెడు విమర్శలు ఎదుర్కొంటున్న ఓ కళాకారుడి వ్యధ ఎలా ఉంటుందో ఈ సినిమా తెలియజేస్తుంది.
'చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్' సినిమా సెప్టెంబర్ 23వ తేదీన రిలీజ్ అవుతున్న క్రమంలో, నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman Interview) ఒక ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన మదిలోని భావాలను నిర్మోహమాటంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“నేను నా గురించి ఎన్నో నెగటివ్ రివ్యూస్ చదివాను. నేను సినిమాలు చేయడం మానేయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని పలువురు వార్తులు వ్రాశారు. నాకు నటన రాదని.. అందుకే నేను సినీ ఇండస్ట్రీలో ఉండకూడదని కూడా కొందరు విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా, నన్ను ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదన్నారు. ఇలాంటి రివ్యూస్ మాలాంటి నటులన్ని చాలా బాధపెడతాయి” అంటూ చెప్పుకొచ్చారు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman).