దుల్కర్‌‌ సల్మాన్ (Dulquer Salman) హీరోగా నటించిన ‘సీతారామం’ (Sitaramam) సినిమా కథ ఎలా పుట్టిందంటే.. ?

Updated on Sep 13, 2022 08:52 PM IST
ఓ ఉత్తరం ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచన హను రాఘవపూడికి (Director Hanu Raghavapudi) ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఓ ఉత్తరం ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచన హను రాఘవపూడికి (Director Hanu Raghavapudi) ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా నటించిన సినిమా ‘సీతారామం’ (Sitaramam). మృణాల్‌ ఠాకూర్‌‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఆగస్టు 5వ తేదీన విడుదలైన ‘సీతారామం‘ సినిమా హిట్‌ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని కేంద్రాలలోనూ సూపర్‌‌హిట్‌ టాక్‌తో దూసుకెళుతూ, బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

చిన్న సినిమాగా వచ్చి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది 'సీతారామం' (Sitaramam) సినిమా. రష్మికా మందన్న (Rashmika Mandanna), సుమంత్ (Actor Sumanth) ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ‘సీతారామం‘ సినిమా ఓటీటీ దిగ్గజం అమెజాన్‌లో హంగామా చేస్తోంది.

ఈ సినిమా కథ రామ్‌ అనే ఓ యుద్ధ ఖైదీ రాసిన లేఖ చుట్టూ తిరుగుతుంది. రామ్‌ తన ప్రేయసి సీతామాలక్ష్మికి రాసిన ఈ లేఖ దాదాపు 20 సంవత్సరాల తర్వాత  ఆమెకు ఎలా చేరింది.? అసలు ఆ లేఖలో ఏముంది.? అన్నదే ‘సీతారామం‘ సినిమా కథ.

సెకండ్‌ హ్యాండ్ పుస్తకంలో..

అసలు ఓ లేఖను ఆధారంగా చేసుకొని, సినిమా తీయాలన్న ఆలోచన రావడమే ఓ అద్భుతం. ఆ ఆలోచన హను రాఘవపూడికి (Director Hanu Raghavapudi) ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆయనకు హైదరాబాద్‌ కోఠిలో దొరికే సెకండ్‌ హ్యాండ్‌ బుక్స్‌ను కొని చదివే అలవాటు ఉండేదట . అలా ఒక రోజు ఓ పాత పుస్తకాన్ని కొని చదువుతున్న సమయంలో, ఆయనకు పేజీల మధ్య ఓ ఉత్తరం దొరికిందట

అయితే ఆ లెటర్‌‌ అప్పటికి తెరిచి లేదు. హను రాఘవపూడి దానిని తెరిచి చదవారట. హైదరాబాద్‌లో చదువుకుంటున్న ఓ కుర్రాడికి, ఊరి నుండి తల్లి పంపిన ఉత్తరం అది. కాగా ఈ సంఘటనే 'సీతారామం' (Sitaramam) కథకు బీజం పడేలా చేసిందట. ఒక వ్యక్తిని ఉద్దేశించి రాసే లేఖ, ఆఖరికి అతనికి చేరిందా? లేదా? అనే ప్రశ్న నుంచే 'సీతారామం' సినిమా కథ పుట్టుకొచ్చిందట. ఈ విషయాన్ని  ఓ ఇంటర్వ్యూలో తెలిపారు డైరెక్టర్.

Read More: Sita Ramam: ‘సీతారామం’ డిలీట్ సీన్ రిలీజ్‌.. ‘నా దేశం ప‌రువును మీతో పంప‌లేను కదా’ అని ఎవ‌ర‌న్నారంటే..

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!