Dulquer Salman: దుల్కర్ సల్మాన్ కు టాలీవుడ్ లో మరో ఛాన్స్.. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో సినిమా?

Updated on Aug 19, 2022 02:45 PM IST
శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఒక మూవీ లో నటించబోతున్నట్లు, కథా చర్చలు కూడా నడుస్తున్నట్లు సమాచారం.
శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఒక మూవీ లో నటించబోతున్నట్లు, కథా చర్చలు కూడా నడుస్తున్నట్లు సమాచారం.

టాలీవుడ్ సక్సెస్‏ఫుల్ డైరెక్టర్ హనురాఘవపూడి (Hanu Raghavapudi) తెరకెక్కించిన అందమైన ప్రేమకథ 'సీతారామం' (SitaRamam). అందమైన ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో దుల్కర్ సల్మాన్ కి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, మలయాళం సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), నాగ్ అశ్విన్ దర్శకత్వం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మహానటి' మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో జెమినీ గణేషన్ పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్ తన నటన తో ప్రేక్షకులను అలరించాడు.

ఇదిలా ఉంటే.. దుల్కర్ సల్మాన్ మరో తెలుగు సినిమాలో నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఒక మూవీ లో నటించబోతున్నట్లు, ఇప్పటికే ఈ మూవీ ఈ విషయమై శేఖర్ కమ్ముల, దుల్కర్ సల్మాన్ కు మధ్య కథా చర్చలు కూడా నడుస్తున్నట్లు సమాచారం.

దుల్కర్ సల్మాన్ నటించిన 'సీతారామం' పోస్టర్ (Dulquer Salman Starrer Sitaramam Poster)

శేఖర్ కమ్ముల ఇప్పటికే కోలీవుడ్ నటుడు ధనుష్ (Hero Dhanush) హీరోగా ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సర్' అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. 

ఇక, ఈ మూవీ అనంతరం ధనుష్.. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) షూటింగ్ పనులను ప్రారంభించనుంది. ఈ సినిమా పూర్తయ్యేలోగా కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో శేఖర్ కమ్ముల మరొక హీరోతో సినిమా చేయాలని భావిస్తున్నారట. అందుకే దుల్కర్ సల్మాన్ కి ఓ కథ వినిపించారట శేఖర్ కమ్ముల. దుల్కర్ ఈ సినిమా చేయడానికి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. రామ్, సీతామహాలక్ష్మిల ప్రేమకథతో రూపొందిన ఈ అద్భుతమైన ప్రేమకావ్యం ఆడియన్స్‏ను కట్టిపడేసింది. ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. తాజాగా ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్ లో చేరింది.

Read More: Dulquer Salman: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయోపిక్‌లో దుల్కర్ సల్మాన్.. ఈ వార్తల్లో నిజమెంత?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!