RRR Movie: ఆ విష‌యంలో 'ఆర్ఆర్ఆర్' సినిమాను మించిపోయిన డీజే టిల్లు!

Updated on May 26, 2022 09:01 PM IST
డీజే టిల్లు, ఆర్ఆర్ఆర్ పోస్ట‌ర్స్ (RRR, DJ Tillu Movie Posters)
డీజే టిల్లు, ఆర్ఆర్ఆర్ పోస్ట‌ర్స్ (RRR, DJ Tillu Movie Posters)

క‌రోనా కార‌ణంగా గత రెండేళ్లుగా చాలావరకు టాలీవుడ్ (Tollywood) సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటూ వచ్చాయి. థియేటర్లు బంద్ కావడంతో కొన్ని సినిమాలు రిలీజ్ కాలేదు. నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించ‌డంతో ఈ ఏడాది స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకూ దాదాపుగా పెద్ద సినిమాలన్నీ రిలీజ‌య్యాయి. ఒకటి రెండు సినిమాలు మాత్ర‌మే విడుద‌ల కాలేక‌పోయాయి. ఇక‌, ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన‌ సినిమాలలో బెస్ట్ సినిమా ఏదంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఒకే ఒక సినిమా. అదే దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించిన‌ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా డీవీవీ దాన‌య్య‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ఎన్టీఆర్.. కొమురం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. ఇక‌, ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలను వసూలు చేసింది. 

ఇన్ని కోట్లు వ‌సూలు చేసినా.. ఈ ఏడాది బెస్ట్ సినిమాల‌లో ఆర్ఆర్ఆర్ (RRR) లేదట. ఒక చిన్న సినిమా ఉందట. ఆ చిన్న సినిమా ఏది అని అనుకుంటున్నారా… అదే డీజే టిల్లు. టాలీవుడ్ ఎటువంటి అంచనాలు లేకుండా విడుద‌ల‌యిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇక‌, ఇప్ప‌టివ‌ర‌కు ఆర్ఆర్ఆర్ కు రూ.609 కోట్ల షేర్ రాగా, కేజిఎఫ్ 2 సినిమాకు రూ.502 కోట్లు, భీమ్లా నాయక్ రూ.97.63 కోట్లు కొల్ల‌గొట్టాయి. అలాగే.. రాధేశ్యామ్ రూ.83.20 కోట్లు, ఆచార్య రూ.48.36 కోట్లు, బంగార్రాజు రూ.39.15 కోట్లు, సర్కారు వారి పాట రూ.80 కోట్లు వసూలు చేసింది. 

అసలు విషయానికి వస్తే.. DJ టిల్లు సినిమా ని ఆ చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ కేవలం 3 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించాడు. మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో దాదాపుగా రూ.30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, రూ.18 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది. దీంతో ఈ సినిమాని కొన్న బయ్యర్స్ కి మూడింతలు లాభాలు వ‌చ్చాయి. ఇక‌, ఇటీవల కాలంలో డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టిన సినిమానే లేదు. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) రూ.300 కోట్లతో RRRని తెర‌కెక్కిస్తే, ఆ సినిమా విడుదలకి ముందే దాదాపుగా అన్ని ప్రాంతాలకు కలిపి రూ.500 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక, ఈ సినిమా విడుదలయిన తర్వాత కూడా అన్ని ప్రాంతాలకు కలిపి రూ.600 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసింది. కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ మీద ఈ సినిమా వంద కోట్ల రూపాయిల షేర్ ని లాభాల రూపం లో తెచ్చిపెట్టడం విశేషం. మ‌రోవైపు DJ టిల్లు 6 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఫుల్ రన్ లో 18 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి మూడింతలు లాభాల్ని ఆర్జించింది అన్నమాట. దీంతో లాభాల విషయంలో RRR సినిమా కూడా DJ టిల్లు తర్వాతే అని ట్రేడ్ పండితులు అభిప్రాయప‌డుతున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!