క్రేజ్ త‌గ్గే సినిమాలు చేయ‌నంటున్న డీజే టిల్లు!(Siddhu Jonnalagadda )

Updated on Apr 30, 2022 03:36 PM IST
Siddhu Jonnalagadda: డీజే టిల్లుతో పాపుల‌ర్ హీరోగా మారారు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌. డీజే టిల్లు హిట్ త‌ర్వాత ఆ సినిమాలు చేయ‌నంటున్నాడు. ఒప్పుకున్న సినిమాలు చేయ‌న‌ని సిద్ధు ఎందుకంటున్నాడు..

సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda )  హీరోగా నటించిన డీజే టిల్లు సూప‌ర్ హిట్ అయింది. ఫుల్ ఎంట‌ర్‌ట్రైన్మెంట్ అందించేలా  సిద్ధు యాక్ట్ చేశారు. డీజే టిల్లు సినిమాలో కామెడీ సీన్స్ ప్రేక్ష‌కులు తెగ ఎంజాయ్ చేశారు. సూర్యదేవర నాగవంశీ టీజే టిల్లు సినిమాను న‌టించారు.  సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో చిత్రం తెర‌కెక్కించారు. 

హీరోగా సిద్ధుకు హిట్ ఇచ్చిన సినిమా టీజే టిల్లు. ఈ సినిమా త‌ర్వాత సిద్ధు నెక్ట్స్ సినిమాల‌పై ఫుల్ పోక‌స్ పెట్టాడు. యూత్ ఫేవ‌రేట్ హీరోగా మారిన సిద్ధు అప్పుడెప్పుడో ఒప్పుకున్న సినిమాలు చేయ‌నంటున్నాడు. చిన్న సినిమాలు చేయ‌డం ఇప్పుడు కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పేశాడు. 

డీజే టిల్లు సినిమా కంటే ముందు సిద్ధు చిన్న సినిమాలు చేస్తాన‌ని ఒప్పుకున్నాడు. డీజే టిల్లు సినిమా సిద్ధు కేరీర్ పీక్స్ చేసింది. సో ఇప్పుడు చిన్న సినిమాల‌తో క్రేజ్ త‌గ్గించుకోలేన‌నంటూ ఫీల్ అవుతున్నాడు. మలయాళంలో విజయం సాధించిన 'కప్పేలా' రీమేక్‌లో నటించేందుకు సిద్దు మొద‌ట అంగీక‌రించాడు. శౌరి చంద్రశేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

త‌న రేంజ్‌కు త‌గ్గ సినిమాలు చేస్తాన‌ని... చిన్న సినిమాలు చేయ‌లేన‌ని సిద్ధు(Siddhu Jonnalagadda )  అంటున్నాడు. శౌరి చంద్ర‌శేఖ‌ర్ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చే సినిమా చేయ‌న‌ని నిర్మాత‌ల‌కు చెప్పేశాడ‌ట‌. శౌరి చంద్ర‌శేఖ‌ర్ మాత్రం సిద్ధు ఎందుకు ఒప్పుకోవంటూ ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య వార్ న‌డుస్తుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. సైన్ చేసిన సినిమాలు చేయ‌క‌పోతే ఎలా కుదురుతుందని ద‌ర్శ‌కులు అంటుంటే... త‌న క్రేజ్ త‌గ్గించుకునే సినిమాలు చేసే సీన్ లేదంటున్నాడు సిద్ధు.
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!