DJ Tillu Sequel: 'డీజే టిల్లు' సీక్వెల్ కు దర్శకుడు మారాడా.. సిద్దు (Siddhu), విమల్ మధ్య గొడవలే కారణమా?

Updated on Jul 18, 2022 08:52 PM IST
డీజే టిల్లు పోస్టర్, డైరెక్టర్ విమల్ తో సిద్దు (DJ Tillu Poster, Siddhu With Director Vimal Krishna)
డీజే టిల్లు పోస్టర్, డైరెక్టర్ విమల్ తో సిద్దు (DJ Tillu Poster, Siddhu With Director Vimal Krishna)

DJ Tillu Sequel: ‘డీజే టిల్లు పేరు.. వీని స్టైలే వేరు’ అంటూ ఇటీవల థియేటర్ల వద్ద తీన్మార్‌ ఆడేశాడు టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల దుమ్ముదులిపింది. సిద్ధు జొన్నలగడ్డ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్‌ అయి అట్లుంటది ప్రేక్షకులతోటి అనేలా చేసింది. సితార బ్యానర్లో నాగవంశీ నిర్మాతగా, విమల్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ హిట్‌ మూవీకి వన్ ఆఫ్ ది స్టోరీ రైటర్ సిద్ధు కావడం విశేషం. 

సిద్ధు జొన్నల గడ్డకు (Siddhu Jonnalagadda) 'డీజే టిల్లు' సినిమాతో సుమారు 12 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ప్లాన్‌ చేశారు దర్శకనిర్మాతలు. అయితే తాజాగా 'డీజే టిల్లు' డైరెక్టర్ విమల్‌ కృష్ణ ఈ సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ సీక్వెల్ ప్రారంభమైన తర్వాత దర్శకుడు విమల్, హీరో సిద్ధుకు మధ్య పలు క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సిద్ధు ప్రవర్తనతో హర్ట్‌ అయిన విమల్‌ కృష్ణ ఈ సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 

ఈ క్రమంలో ఇక వెళ్లిపోయిన డైరెక్టర్ వెంటపడడం కంటే.. స్టోరీ అండ్ కంటెంట్ ను నమ్మకుని సీక్వెల్ (DJ Tillu Sequel) ని త్వరలోనే తెరకెక్కించే పనిలో పడుతున్నారట మేకర్స్. అన్నీ అనుకున్నట్లుగా వర్కౌట్ అయితే ఓ కొత్త డైరెక్టర్ కి ఈ ప్రాజెక్ట్ ని అప్పజెప్పబోతున్నారట. త్వరలోనే ఈ కన్ ఫ్యూజన్ కి క్లారిటీ వచ్చేలా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేయబోతున్నారట. అయితే డైరక్టర్ లేని ఇంప్యాక్ట్ సినిమా మీద ఏ మేరకు పడుతుందో అన్నది చూడాలి. 

ఇక డీజే టిల్లు సీక్వెల్ లో నటించబోయే నటుల విషయానికి వస్తే సిద్ధుతోపాటు హీరోయిన్ నేహాశెట్టి (Neha Shetty), ప్రిన్స్‌, బ్రహ్మాజీ లాంటి పార్ట్ వన్ లో ఉన్న క్యారెక్టర్స్‌ ఈ సీక్వెల్ లోనూ ఉండబోతున్నారట. డీజే టిల్లు తొలి భాగంలో ప్రేక్షకుల ఏ సీన్స్‌ కు ఎంటర్టైన్ అయ్యారో, ఇందులో అంతకు మించిన సీన్స్‌ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. మరి వచ్చే కొత్త దర్శకుడితో అయినా ఇలాంటి ఇష్యూస్ రాకుండా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కి హిట్ కొడతారేమో చూడాలి.

Read More: Dj Tillu Part 2: 'డీజే టిల్లు' మళ్లీ వచ్చేస్తున్నాడు.. ఆగస్టు నుంచి షూటింగ్ షురూ!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!