RC15 Movie : హై ఓల్టేజ్ ప‌వ‌ర్ ఉన్న క్యారెక్ట‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్ కోసం శంక‌ర్ సృష్టించాడా!

Updated on May 24, 2022 10:26 AM IST
RC15 Movie: రామ్ చ‌ర‌ణ్ సీఎం పాత్ర‌లో చేస్తే ఆ కికే వేరంటున్నారు ఫ్యాన్స్. 
RC15 Movie: రామ్ చ‌ర‌ణ్ సీఎం పాత్ర‌లో చేస్తే ఆ కికే వేరంటున్నారు ఫ్యాన్స్. 

RC15 Movie: టాలీవుడ్‌లో రామ్ చ‌ర‌ణ్  ఆర్.ఆర్.ఆర్. త‌ర్వాత మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆర్.పఆర్.ఆర్ సినిమా ఇండియ‌న్ సినిమాలో వేయి కోట్లుకు పైగా వ‌సూళ్లు చేసింది. రామ్ చ‌ర‌ణ్ అల్లూరిగా అద్భుతంగా న‌టించారంటూ  సౌత్, నార్త్ ప్రేక్ష‌కులు మెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న‌ పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తున్నారు.

 

RC15 Movie: రామ్ చ‌ర‌ణ్ సీఎం పాత్ర‌లో చేస్తే ఆ కికే వేరంటున్నారు ఫ్యాన్స్. 

రామ్ చ‌ర‌ణ్(Ram Charan), శంక‌ర్ (Shankar) కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమాను ప్ర‌స్తుతం ఆర్‌సీ15గా పిలుస్తున్నారు. ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా రానుంది. రామ్ చ‌ర‌ణ్ సివిల్ స‌ర్వీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. శంక‌ర్ ఈ సినిమాతో ఓ మెసేజ్ కూడా ఇవ్వ‌నున్నారు. ఆర్‌సీ15 షూటింగ్ బిజీ బిజీగా సాగుతుంది. సోష‌ల్ మీడియాలో లీక్ అవుతున్న ఫోటోల‌తో అభిమానులు రామ్ చ‌ర‌ణ్ సినిమా అదిరిపోనుందంటూ అంచ‌నాలు వేసుకుంటున్నారు. 

RC15 Movie: రామ్ చ‌ర‌ణ్ సీఎం పాత్ర‌లో చేస్తే ఆ కికే వేరంటున్నారు ఫ్యాన్స్. 

RC15 Movie: ఆర్‌సీ15లో రామ్ చ‌ర‌ణ్ డ‌బుల్ రోల్‌లో న‌టిస్తార‌ట‌. అంతేకాదు చాలా ర‌కాల గెటెప్స్ ఉంటాయ‌ట‌. క‌త్తి లాండి కోడెలా రామ్ చ‌ర‌ణ్ షార్ట్ టెంప‌ర్ పాత్ర‌ను చేస్తున్నార‌ట‌. ప్ర‌భుత్వాల విధానాల‌తో విసిగిపోయిన రామ్ చ‌ర‌ణ్.. ముఖ్య‌మంత్రి ఎలా అవుతాడు.. సీఎంగా ఏం చేస్తాడ‌నే క‌థ‌తో ఈ సినిమా స్టోరి ఉంటుంద‌ట‌.  శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ న‌టుడు అర్జున్ హీరోగా ఒక్కే ఒక్క‌డు ఇలాంటి స్టోరితోనే బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించింది. అర్జున్ ఒక్క రోజు సీఎం అయి ఏం చేశాడు అనేది ఒక్కే ఒక్క‌డు సినిమా స్టోరి. ఇక‌ రామ్ చ‌ర‌ణ్ కూడా శంక‌ర్ సీఎం చేసి తెర‌పై ఏం చేయిస్తాడో చూడాలి. రామ్ చ‌ర‌ణ్ సీఎం పాత్ర‌లో చేస్తే ఆ కికే వేరంటున్నారు ఫ్యాన్స్. 

సినిమాల‌తో మెసేజ్ ఇవ్వ‌డంలో ద‌ర్శ‌కుడు శంక‌ర్ టాప్ అనే చెప్పాలి. ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు వంటి సినిమాలు చేసి అవినీతిపై ఓ యుద్ధాన్నే వెండితెర‌పై సృష్టించాడు. ఈ మ‌ధ్య కాలంలో శంక‌ర్ టెక్నాల‌జీపై సినిమాలు తీశారు. రోబో, 2.0 సినిమాల్లో టెక్నాల‌జీతో ఏం చేయ‌చ్చో చూపించాడు. రామ్ చ‌ర‌ణ్‌తో తీస్తున్న సినిమా క‌థ‌ కూడా రాజ‌కీయ నేప‌థ్యంలోనే సాగుతుంది. 

RC15 Movie: రామ్ చ‌ర‌ణ్ సీఎం పాత్ర‌లో చేస్తే ఆ కికే వేరంటున్నారు ఫ్యాన్స్. 

RC15 Movie: ప్రస్తుతం రామ్ చ‌ర‌ణ్ ఆర్‌సీ15 (RC15) మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రామ్ స‌ర‌స‌న కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. కీర్తి సురేష్ నెగెటివ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తార‌నే టాక్ వినిప‌స్తుంది. ఈ సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.  నాలుగు పాట‌లను త‌మ‌న్ కంపోజ్ చేశార‌ట‌. అందులో రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి అయింద‌ట‌. త్వరలో చిత్ర టైటిల్, పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తార‌నే టాక్ వినిపిస్తుంది. 

రామ్ చ‌ర‌ణ్ చేస్తున్న 15వ సినిమాను దిల్ రాజు, సిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అంజ‌లి, జ‌య‌రాం, సునీల్, శ్రీకాంత్, న‌వీన్ చంద్ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 2021 ఫిబ్ర‌వ‌రిలో ఆర్‌సీ 15 సినిమా మొద‌లైంది. ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్, మ‌హారాష్ట్ర‌, వైజాగ్, పంజాబ్‌ల‌లో జ‌రుగ‌నుంది. సినిమాటోగ్ర‌ఫీ వ‌ర్క్ తిర్రు, ఆర్. ర‌త్న‌వేలు క‌లిసి చేస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!