సూపర్‌‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ‘జైలర్’ సినిమాలో విలన్​గా రమ్యకృష్ణ.. కన్ఫర్మ్ చేసిన మేకర్స్

Updated on Aug 25, 2022 08:49 PM IST
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), రమ్యకృష్ణ చాలా సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తున్నారు
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), రమ్యకృష్ణ చాలా సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తున్నారు

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), దర్శకుడు నెల్సన్​ దిలీప్​ కుమార్​ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ‘జైలర్​’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్​ కూడా ప్రారంభమైనట్టు ప్రకటించారు మేకర్స్​. “బీస్ట్”, “వరుణ్ డాక్టర్” సినిమాలతో దర్శకుడిగా మంచిపేరు తెచ్చుకున్న దిలీప్​ సూపర్​స్టార్​ రజినీకాంత్​ని ఎలా డైరెక్ట్​ చేయబోతున్నారోనని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఒక భారీ యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా అభిమానుల్లో చాలా అంచనాలు రేకెత్తిస్తుంది. లేటెస్ట్ గా అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాగా దీనికి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక తాజాగా అయితే చిత్ర మేకర్స్ ఈ సినిమాపై ఇంకో బిగ్ అప్డేట్ ని కూడా అందించారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), రమ్యకృష్ణ చాలా సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తున్నారు

భారీ హైప్‌ క్రియేట్..

ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం పేర్లు రివీల్ చేస్తూ ఇది వరకు వచ్చిన  స్టార్ నటి రమ్య కృష్ణ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ పవర్ ఫుల్ కాంబోలో ఉండే మ్యాజిక్ ఎలాంటిదో తమిళ్ సహా తెలుగు ప్రేక్షకులకి కూడా తెలుసు.

వీరి మధ్య సీన్లు ఏ లెవెల్లో ఉంటాయో ‘నరసింహ’ చూసినవాళ్లు అంత తేలిగ్గా మర్చిపోరు. అందుకే ఈ సినిమాలో రమ్య కృష్ణ పేరు అనగానే ఆ మధ్యనే భారీ హైప్ రాగా ఇప్పుడు చిత్ర యూనిట్ కూడా దీనిపై అధికారిక అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ లో మరింత ఉత్సుకత తీసుకొచ్చింది. దీంతో రజినీ (Rajinikanth) – రమ్యకృష్ణ సెన్సేషనల్ కాంబోని తెరపై ఎప్పుడు చూస్తామా అని రజినీ అభిమానులతోపాటు సినీ ప్రేమికులు కూడాఎదురు చూస్తున్నారు. 

Read More : రజినీకాంత్ (Rajinikanth), విజయ్ (Vijay) వంటి స్టార్‌‌ హీరోల రెమ్యునరేషన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!