‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ అవుతున్న ‘డాన్స్‌ ఐకాన్’ షోకు చీఫ్ గెస్ట్‌గా హీరోయిన్‌ రాశీ ఖన్నా (Raashi Khanna)

Updated on Nov 03, 2022 02:32 PM IST
ఇప్పటికే చాలా డ్యాన్స్‌ షోలకు యాంకర్‌‌గా వ్యవహరించిన ఓంకార్ . డ్యాన్స్‌  ఐకాన్ షోతో ఆహా (Aha) ఓటీటీలో సందడి చేస్తున్నారు
ఇప్పటికే చాలా డ్యాన్స్‌ షోలకు యాంకర్‌‌గా వ్యవహరించిన ఓంకార్ . డ్యాన్స్‌ ఐకాన్ షోతో ఆహా (Aha) ఓటీటీలో సందడి చేస్తున్నారు

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ (Aha) సక్సెస్‌పుల్‌ షోలను కండక్ట్‌ చేస్తూ తక్కువ కాలంలోనే  బాగా పాపులర్ అయ్యింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాపబుల్ సీజన్‌1 ప్రపంచంలోని టాప్‌10 టాక్‌ షోలలో చోటు దక్కించుకుంది. ఇక ప్రస్తుతం అన్‌స్టాపబుల్‌ సీజన్‌2 స్టార్ట్ అయ్యింది. అది కూడా విజయవంతంగా దూసుకెళుతోంది. షో మొదటి ఎపిసోడ్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌తో సందడి చేశారు బాలకృష్ణ. ఇక, రెండు మూడు ఎపిసోడ్స్‌లో యంగ్ హీరోలతో ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులను అలరించారు.

ఆహాలో ప్రసారమవుతున్న మరో ఇంట్రెస్టింగ్‌ షో ‘డాన్స్ ఐకాన్’. టెలివిజన్‌లో డాన్స్, రియాలిటీ షోలు నిర్వహించి అలరించిన ఓంకార్.. మొదటిసారి ఓటీటీలో నిర్వహిస్తున్న షో ఇది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నిర్వహిస్తున్న డాన్స్ ఐకాన్‌ షోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓంకార్ హోస్ట్‌గా మొదలైన ఈ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మొత్తం పన్నెండు టీమ్స్‌తో మొదలైన ఈ షోలో ప్రస్తుతం 8 టీమ్స్‌ పోటీలో ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌, థీమ్‌తో తన షోను యూనిక్‌గా నిర్వహిస్తుంటారు ఓంకార్. ఈ షోలో పార్టిసిపేట్‌ చేసే ఒక్కో టీమ్‌ను ఒక్కో నిర్మాత స్పాన్సర్ చేస్తున్నారు. దీంతో ఈ షోపై అందరి దృష్టిపడింది. టైటిల్‌ కోసం ఎనిమిది టీమ్స్ పోటీ పడుతున్న ఈ షో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఆహాలో ప్రసారమవుతోంది.

ఇప్పటికే చాలా డ్యాన్స్‌ షోలకు యాంకర్‌‌గా వ్యవహరించిన ఓంకార్ . డ్యాన్స్‌  ఐకాన్ షోతో ఆహా (Aha) ఓటీటీలో సందడి చేస్తున్నారు

ప్రోమోకు మంచి రెస్పాన్స్..

కాగా, ఈ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్స్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఈ ఎపిసోడ్స్‌కు స్పెషల్‌ గెస్ట్‌గా హీరోయిన్ రాశీ ఖన్నా హాజరయ్యారు. షోకు గెస్ట్‌గా వచ్చిన రాశీ ఖన్నాకు బొకే ఇచ్చి వెల్‌కం చెప్పారు ఓంకార్. ‘పెద్ద రోజాకు రోజా బొకే ఇచ్చినట్టుంది’ అన్నారు ఓంకార్. ఓంకార్ చెప్పిన ఈ డైలాగ్ వైరల్ అవుతోంది. కొరియోగ్రాఫర్ యష్‌.. రాశీ ఖన్నా (Raashi Khanna)తో కలిసి స్టెప్పులేశారు. ఈ షోలో డాన్స్‌లు చూసి రాశీఖన్నా మెస్మరైజ్ అయ్యారు.

డాన్స్ ఐకాన్ షోకు జడ్జీలుగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ ప్రధాన జడ్జీలు కాగా.. నటి మోనాల్ గజ్జర్, డాన్స్ మాస్టర్ యష్, యాంకర్ శ్రీముఖి జడ్జీలుగా ఉన్నారు. ఈ వారం థీమ్‌ను జడ్జీస్ ఛాలెంజ్‌గా నిర్ణయించారు. సౌతిండియాలో బెస్ట్ డాన్స్ రియాలిటీ షోగా ఆహా (Aha)లో ప్రసారమవుతున్న ‘డాన్స్ ఐకాన్’ గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల విడుదల చేసిన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Read More : ఐఏఎస్‌ ఆఫీసరై ప్రజలకు సేవ చేయాలని అనుకున్నా..కానీ నటినై అభిమానులను అలరిస్తున్నాను: రాశీ ఖన్నా (Raashi Khanna)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!