ఒకే ఫ్రేమ్‌లో విశ్వక్‌సేన్ (Vishwak Sen), అర్జున్ సర్జా, రవి బస్రూర్‌‌.. వైరల్ అవుతున్న పిక్

Updated on Jul 20, 2022 12:23 AM IST
యంగ్‌ హీరో విశ్వక్‌సేన్ (Vishwak Sen), అర్జున్ సర్జా, ఐశ్వర్యా అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్‌‌
యంగ్‌ హీరో విశ్వక్‌సేన్ (Vishwak Sen), అర్జున్ సర్జా, ఐశ్వర్యా అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్‌‌

‘అశోక‌వ‌నంలో అర్జుణ క‌ల్యాణం’ సినిమాతో మంచి హిట్‌ అందుకున్నారు యంగ్ హీరో విశ్వక్‌సేన్ (Vishwak Sen). ఈ క్రేజీ యాక్టర్ ప్రస్తుతం యాక్షన్ కింగ్‌ అర్జున్ సర్జా ద‌ర్శక‌త్వంలో సినిమాలో నటిస్తున్నారు. విశ్వక్ సేన్ 11వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్యా అర్జున్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ హిట్ అందుకున్న కేజీఎఫ్ సినిమాకు మ్యూజిక్ అందించారు రవి బస్రూర్. అర్జున్‌ – విశ్వక్‌సేన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్‌కు రవి బస్రూర్ హాజరయ్యారు. ఈ సినిమాలోని పాటలకు మంచి ఫీల్‌ ఉన్న ట్యూన్స్‌ వచ్చాయని ఇండస్ట్రీ టాక్.

సెల్ఫీ పోటోలో రవి బస్రూర్‌‌, విశ్వక్‌సేన్, అర్జున్‌ సర్జా

టాలీవుడ్‌కు కొత్త అందం..

విశ్వక్ సేన్‌, అర్జున్‌, ర‌వి బ‌స్రూర్ క‌లిసి దిగిన సెల్ఫీ ఒక‌టి నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాతో అర్జున్‌ సర్జా కూతురు ఐశ్వర్యా అర్జున్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.

అర్జున్ సొంత బ్యానర్‌‌ శ్రీరామ్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌పై సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. విశ్వక్‌సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తున్న మరో సినిమా ధమ్‌కీ షూటింగ్‌ కూడా ఇటీవలే థాయ్‌ల్యాండ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నారు.

Read More : మహేష్‌బాబు (MaheshBabu) ఫ్యాన్స్‌కు బర్త్‌డే గిఫ్ట్..థియేటర్లలో సందడి చేయనున్న ‘ఒక్కడు’ సినిమా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!